Anushka Sharma : ఇండియాను వదిలి విదేశాల్లో సెటిల్ అవుతున్న విరుష్క… కారణం ఇదే

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొన్నేళ్ల పాటు చక్రం తిప్పింది ఈ భామ. పీకే, సుల్తాన్, సంజు వంటి భారీ బ్లాక్ బస్టర్లతో ఆల్మోస్ట్ నంబర్ వన్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగిన ఈ భామ కెరీర్ పీక్స్ లో ఉండగానే స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీని పెళ్లిచేసుకుంది. బాలీవుడ్ లో పెద్ద పెద్ద సెలబ్రిటీల సమక్షంలో పెళ్లి చేసుకున్న వీరి జంటను ఆశీర్వదించాడి ప్రధాని మోదీ కూడా రావడం జరిగింది. ఇక పెళ్లి తర్వాత విరాట్ కోహ్లీ తన ఆటపై ద్రుష్టి పెట్టగా అనుష్క శర్మ మాత్రం సినిమాలకి గుడ్ బై చెప్పేసింది. అయితే అప్పటికే సెట్స్ పై ఉన్న సినిమాలు మాత్రమే పూర్తి చేయగా, లేటెస్ట్ గా చెక్ దే ఎక్స్ ప్రెస్ అనే సినిమాలో మాత్రమే నటిస్తుంది. అది కూడా క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా కావడం విశేషం.

ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన విరుష్క..

అయితే విరాట్ కోహ్లీ అనుష్క శర్మ దంపతులు ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు. పెళ్లి తరవాత కూడా రెండు మూడేళ్లు వరుస సినిమాలు చేసిన అనుష్క శర్మ బిడ్డ పుట్టిన తర్వాత సినిమాలకి ఆల్మోస్ట్ ఎండ్ కార్డు ఇచ్చేసింది. అయితే రెండో బిడ్డ కూడా పుట్టాక సినిమాలకి పూర్తిగా స్వస్తి చెప్పనున్నట్టు సమాచారం. అయితే అనుష్క శర్మ ప్రస్తుతం సెట్స్ పై ఉంచిన సినిమా చెక్ దే ఎక్స్ ప్రెస్ మాత్రం పూర్తి చేస్తుందని సమాచారం. ఆ సినిమా ఇప్పటికే పూర్తి కావాల్సి ఉండగా, అనుష్క శర్మ తనకు పుట్టబోయే బిడ్డ కోసం వాయిదా వేయాల్సి వచ్చింది. దాంతో ఈ సినిమా ఏడాది పాటు వాయిదా పడింది. అయితే తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం విరుష్క జంట విదేశాల్లో సెటిల్ అవబోతున్నారని సమాచారం. వివరాల్లోకి వెళితే..

- Advertisement -

ఇక పై విదేశాల్లోనే.. ఎందుకంటే?

అయితే పెళ్లి తర్వాత అనుష్క శర్మ దంపతులు ఇండియాలోనే ఉన్నా, తాజాగా విదేశాల్లో సెటిల్ అవబోతున్నారని సమాచారం. ఇంగ్లాండ్ రాజధాని బ్రిటన్‌లో స్థిరపడేందుకు అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ ప్రయత్నాలు చేస్తున్నట్లు తాజా సమాచారం. ఇక వీరికి రెండో బిడ్డ కూడా బ్రిటన్‌లోనే పుట్టింది. అయితే ఇప్పుడు విరుష్క దంపతులు తమ ఇద్దరు పిల్లల ప్రైవసీ కోసం బ్రిటన్‌లో స్థిరపడాలని నిర్ణయించుకున్నారని తెలుస్తుంది. అయితే క్రికెట్ మ్యాచ్‌ల కోసం విరాట్ కోహ్లీ భారత్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక అనుష్క శర్మ మాత్రం పూర్తిగా బ్రిటన్ లోనే ఉండబోతోందనే టాక్ వినిపిస్తోంది. అయితే ప్రస్తుతానికి అక్కడ సెటిల్ అవుతారా? లేక పూర్తిగా బ్రిటన్ లోనే ఉండిపోతారా అనేది తెలియాల్సింది. అయితే లైఫ్ లాంగ్ అక్కడ ఉంటే ఆ దేశ పౌరసత్వం తీసుకోవాల్సిందే.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు