Vishal: హీరోయిన్లను ఏడిపిస్తే….. చెప్పులతో కొట్టాలి…?

Vishal: స్టార్ హీరో విశాల్ (Vishal) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. విశాల్ (Vishal) సోషల్ మీడియాతో పాటు…. మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటారు. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న విశాల్ సంచలన వాక్యాలు చేయడం జరిగింది. సినిమా ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్లను వేధించిన వారిని చెప్పులతో కొట్టాల్సిందేనంటూ వివాదాస్పద వాక్యాలు చేశారు. ఏ ఇండస్ట్రీలో అయినా ఇలాంటి ఆరోపణలు వస్తున్నాయని ….కాబట్టి ఎవరినైనా వేధిస్తే వెంటనే చెప్పులతో దాడి చేయాలని పేర్కొన్నారు.

హీరో విశాల్ సోషల్ మీడియాతో పాటు మీడియాలో కూడా హైలెట్ అవుతూ ఉంటారు. చిన్న విషయాలకు కూడా స్పందిస్తూ ఉంటారు. తమిళంలోనే కాకుండా టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా సౌత్ ఇండియా స్టార్ హీరో విశాల్ కు మంచి గుర్తింపు ఉంది. అయితే అలాంటి సౌత్ ఇండియా స్టార్ హీరో విశాల్ కేరళలో ఏర్పాటు చేసిన హేమా కమిటీ, అక్కడ హీరోయిన్లపై జరిగిన వేధింపులపై స్పందించారు.

సినిమా ఇండస్ట్రీలో ఎవరో ఒకరు పిచ్చి పట్టి ఆడవాళ్లను పిలుస్తారని పేర్కొన్నారు. అలాంటప్పుడు ఆ మహిళలు, ఆ వ్యక్తిని భయపడకుండా చెప్పుతో కొట్టాలని స్పష్టం చేశారు. తమిళ చిత్రపరిశ్రమలోను అలా మహిళలను వేధించేవారు కచ్చితంగా ఉంటారని చెప్పాడు. అలాంటి వారిపై ధైర్యంగా వచ్చి ఫిర్యాదు చేయాలని కోరడం జరిగింది. కేరళలో ఏర్పాటు చేసిన హేమా కమిటీలాగే తమిళనాడు నడిగర్ సంఘం ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేస్తామని కూడా వెల్లడించారు.

- Advertisement -
Kollywood star Vishal Fire on Tamil Producers Council & governament
Vishal 

కేరళలో అలా ఆడవాళ్లను వేధించిన పాపానికి వారికి తప్పకుండా శిక్ష పడాల్సిందేనని డిమాండ్ చేశారు. మహిళలకు అండగా నిలబడాల్సిన బాధ్యత ప్రతి ఒక్క మగవారిపై ఉంటుందని చెప్పాడు. శ్రీరెడ్డి (Sri Reddy) ఎవరో నాకు తెలియదు. కానీ ఆమె వేసే జోకులు మాత్రం నేను విన్నాను. ఎవరి మీద అయినా నిందలు వేయడం కొందరికి అలవాటుగా మారిందని పేర్కొన్నారు. నిజంగానే ఇబ్బందులు ఎదురైతే పోలీసులకు ఫిర్యాదు చేయొచ్చని వెల్లడించారు. హీరో విశాల్ (Vishal) చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాల్లో సంచలనంగా మారుతున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు