Vishal: ఎందుకు ఇప్పుడు సడన్ గా, బానే సినిమాలు చేసుకుంటున్నావ్ కదా

Vishal: తమిళ్ నటుడు విశాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పేరుకు తమిళ్ హీరో అయినా కూడా తెలుగులో ఎన్నో అద్భుతమైన సినిమాలు చేశాడు విశాల్. అయితే విశాల్ కేవలం సినిమాలు చేయటమే కాకుండా సామాజిక అంశాలపై కూడా ప్రస్తావిస్తూ ఉంటారు. విశాల్ వ్యక్తిత్వం చాలా మందికి ఆదర్శమని చెప్పొచ్చు. కొన్ని ఆడియో వేడుకలలో విశాల్ ప్రవర్తించిన తీరు ఇవన్నీ కూడా చాలామంది ప్రేక్షకులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. నీకు తెలుగులో పొగరు భరణి వంటి ఎన్నో సినిమాలు చేశాడు విశాల్.

ప్రస్తుతం తమిళ్ హీరోలకు కూడా తెలుగులో చాలామంది బ్రహ్మరథం పడుతున్నారు. అలా ఒకప్పుడు సూర్య, విక్రమ్, విశాల్ సినిమాలు ఇక్కడ బాగా ఆడేవి. ఇక ప్రస్తుతం కూడా విశాల్ తమిళ్లో ఏ సినిమా చేసినా కూడా అది ఖచ్చితంగా తెలుగులో రిలీజ్ అవుతుంది. ఇక రీసెంట్ గా కొన్ని సంచలమైన వ్యాఖ్యలు కూడా విశాల పైన వచ్చాయి నటి అభినయను విశాల్ మ్యారేజ్ చేసుకుంటున్నట్లు కూడా వార్తలు వినిపించాయి. ఇకపోతే విశాల్ దాదాపు 11 సంవత్సరాల క్రితం చేసిన సినిమా ఇప్పుడు రిలీజ్ కి సిద్ధంగా ఉంది.

Madha Gaja Raja

- Advertisement -

సుందర్ దర్శకత్వంలో విశాల్ ఎంజీఆర్ అనే ఒక సినిమాను చేశాడు ఈ సినిమా గురించి దాదాపు అందరూ మర్చిపోయారు అనుకునే టైంలో ఈ సినిమా ప్రస్తావన ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తుంది. దీని కారణం ఏంటంటే ఈ సినిమాని ఇప్పుడు రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ ఆగస్టు నెలలో ఈ సినిమా రిలీజ్ కానుంది. ప్రస్తుతం హీరోగా కూడా సినిమాలు చేస్తున్న విజయ్ ఆంటోనీ ఈ సినిమాకి సంగీతం అందించారు. దాదాపు 11 ఏళ్లు పూర్తయిన ఈ సినిమాకి ఇప్పుడు ఎటువంటి ఆదరణ దక్కుతుందో వేచి చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు