Viswaksen: అర్జున్ తో గొడవలు.. నెపోటిజం అంటూ మళ్లీ కెలికిన విశ్వక్ సేన్..!

గతంలో సీనియర్ హీరో అర్జున్ సర్జ నిర్మిస్తూ.. దర్శకత్వం వహించిన చిత్రంలో హీరో విశ్వక్ సేన్ నటిస్తున్నారు అంటూ మొదట్లో వార్తలు వచ్చాయి. అంతేకాదు ఇందులో హీరోయిన్ గా అర్జున్ కూతురు ఐశ్వర్య కూడా నటించడానికి సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు.. కానీ విశ్వక్ సేన్ సమయానికి షూటింగ్ కి రావడం లేదని కొన్ని విభేదాలు ఏర్పడడంతో సినిమా నుంచి విశ్వక్ ను తొలగిస్తున్నట్లు మీడియా ద్వారా ప్రకటించారు అర్జున్ సర్జ . దీనికి సంబంధించి అనేక చర్చలు కూడా జరిగాయి విశ్వక్ సిన్సియారిటీని ప్రశ్నిస్తూ వృత్తిపట్ల విశ్వక్ కి డెడికేషన్ లేదు అంటూ చెప్పారు అర్జున్..

ఆ తర్వాత స్క్రిప్ట్ లో తను సూచించిన మార్పులు దర్శకుడు అంగీకరించడానికి సిద్ధంగా లేనప్పుడు.. తాను పనిచేయలేనని విశ్వక్ కూడా చెబుతూ అర్జున్ కి క్షమాపణ కూడా చెప్పారు.. ఇక ఈ వివాదం ముగిసి చాలా కాలం అయ్యింది.. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో విశ్వక్ దీనిపై స్పందించారు.. విశ్వక్ మాట్లాడుతూ.. నేను ఒకరోజు షూటింగ్ వాయిదా వేయమని చెప్పాను.. కానీ సినిమా చేయనని చెప్పలేదు.. దానికే ఆయన ప్రెస్ మీట్ పెట్టి చాలా మాటలు అన్నారు.. ఒకవేళ నేను బ్యాక్ గ్రౌండ్ ఉన్న హీరోని అయితే అలా చేసేవారా? అందుకే నేను తీసుకున్న పారితోషకం కూడా రెట్టింపు చేసి తిరిగి ఇచ్చేశాను అంటూ సీనియర్ యాక్టర్ అర్జున్ తో విభేదాలపై క్లారిటీ ఇచ్చారు విశ్వక్ సేన్.

అయితే నెపోటిజం ఇండస్ట్రీలో చాలా ఉంది అన్న విషయాన్ని మళ్లీ గుర్తు చేశారు విశ్వక్ సేన్. దీనిపై హీరోలు ఏమైనా స్పందిస్తారేమో చూడాలి.. ఇక సినిమా నుంచి వెళ్లిపోయాడని అర్జున్ చెబుతుంటే నాకు గౌరవం లేని చోట మనసు చంపుకొని పనిచేయలేను అందుకే బయటకి వచ్చేసాను అంటూ అప్పట్లో విశ్వక్ వెల్లడించిన విషయం తెలిసిందే. నిజానికి విశ్వక్ సేన్ ఈ సినిమా అగ్రిమెంట్ చేసుకున్నప్పుడే రెమ్యునరేషన్ వద్దని దాని ప్లేస్ లో నైజాం షేర్ ఇవ్వమని అడగ్గా అలాగే ఒప్పందం కూడా చేసుకున్నారు.. అందుకు తగ్గట్టుగానే విశ్వక్ కి ముందే రూ.50 లక్షలు వరకు ఇచ్చినట్లు వార్తలు వినిపించాయి..

- Advertisement -

కానీ తాజాగా రెట్టింపు చేసి ఇచ్చానని చెబుతున్నారు కాబట్టి కోటి రూపాయల వరకు ఆయన వెనక్కి ఇచ్చినట్లు తెలుస్తోంది .. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం విశ్వక్ చేసిన కామెంట్లు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Checkout Filmify for the latest Movie news in Telugu, New Movie Reviews & Ratings, and all the Entertainment News. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other film industries Movies updates, etc

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు