Viswak Sen: బాబాయ్ – అబ్బాయి పై విశ్వక్ సేన్ షాకింగ్ కామెంట్స్..!

డైరెక్టర్ గా.. హీరోగా.. తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకున్న విశ్వక్ సేన్ ప్రేక్షకులను తన వరుస సినిమాలతో అలరించే ప్రయత్నం చేస్తున్నారు.. ఈ క్రమంలోనే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయన బాబాయ్ అబ్బాయి అయిన బాలకృష్ణ , ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ.. వారితో తనకున్న బంధం పై షాకింగ్ కామెంట్లు చేశారు.. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా హీరోగా ఎదిగాడు. తనకంటూ ఒక ట్యాగ్ తెచ్చుకున్నాడు.. అగ్ర హీరోల సపోర్టుని సాధిస్తూ.. ఇప్పుడు మంచి ఫ్యాన్ బేస్ ని ఏర్పాటు చేసుకున్నాడు.. ప్రస్తుతం ఈయన చేతిలో క్రేజీ మూవీస్ ఉన్నాయి.. హీరోగా ఈయన ఇమేజ్ నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లే సినిమాలు ఉండడం విశేషం.

తాజాగా విశ్వక్ సేన్ ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూలో ముచ్చటించారు.. ఇందులో తన చిన్ననాటి విషయాలతో పాటు కెరియర్ మొదట్లో జరిగిన విషయాలు, బాధలు, కష్టాలు అలాగే తీపి గుర్తులను కూడా పంచుకున్నారు.. అంతేకాదు ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు ఏర్పడిన పరిచయాలు, ఎదుర్కొన్న అవమానాల గురించి అలాగే ఎన్టీఆర్ , రామ్ చరణ్, బాలయ్య వంటి పెద్ద స్టార్స్ సపోర్ట్ కూడా తెలిపారు. అంతేకాదు వీకెండ్ లో పార్టీ విషయాల గురించి కూడా చెప్పుకొస్తూ పలు క్రేజీ విషయాలను పంచుకున్నారు.. ఇక బాలయ్య గురించి మాట్లాడుతూ.. ఆయనతో కలిసి మందేసే విషయాలను కూడా చెప్పడం విశేషం.. వీక్లీ ఒకసారి ఇద్దరూ కూర్చొని మందేస్తారా.. నిజమేనా అంటూ జర్నలిస్ట్ అడగగా.. దీనికి సమాధానం చెబుతూ.. సక్సెస్ మీట్ లో మేము కలిసి పార్టీ చేసుకున్నాము.. ఆ పార్టీలో పెగ్ వేసాము.. అంటూ తెలిపారు..

ఆ తర్వాత రెండు మూడు సార్లు కలిసాము.. వీక్లీ కలవడం జరగదని.. కానీ వీక్లీ ఒక్కసారైనా మాట్లాడుకుంటాము.. వీలు కుదిరితే కలుస్తాము అంటూ తెలిపారు.. అంతేకాదు బాలయ్య గురించి విశ్వక్ సేన్ మాట్లాడుతూ .. నేను గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో నటిస్తున్నప్పుడు గాయం అయింది.. యాక్షన్ సీన్ చేస్తున్నప్పుడు కింద పడితే గాయం జరిగింది.. ఈ విషయం తెలుసుకొని ఐదు రోజుల తర్వాత సినిమా సెట్ కి వచ్చి నన్ను మందలించారు.. ఆ తర్వాత ఫైట్ సీన్లకి ఆయనే ముహూర్తం పెట్టి.. ఆ ముహూర్తంలోనే సీన్లు చేయాలని తెలిపారు. అలా నా విషయంలో ఆయన ఎంతో కేర్ చూపించారు.. ఆ ప్రేమ చాలా గర్వంగా మాటల్లో చెప్పలేనంతగా ఉంటుంది అంటూ తెలిపారు..

- Advertisement -

అలాగే ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ.. నా అభిమాన నటుడు ఎన్టీఆర్ .. నేను కష్టంలో ఉన్నప్పుడు నాకు ఆయన ఒక సలహా ఇచ్చారు.. అది నా జీవితాన్నే మార్చేసింది.. ధమ్కీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి.. ఎన్టీఆర్ ఆస్కార్ అవార్డు వేడుకల కోసం అమెరికాలో ఉన్నారు.. మరో రెండు రోజులు అక్కడ ఎన్టీఆర్ కి ప్రోగ్రామ్స్ ఉన్నాయి.. కానీ వాటిని వదులుకొని నా సినిమా ఈవెంట్ కి వెళ్లాలని చెప్పి వాటిని కాన్సిల్ చేసుకుని మరీ వచ్చారు.. నాకోసం అన్న ఎంతో సాక్రిఫైజ్ చేశారు.. ఇక నేను కష్టాల్లో ఉన్న విషయాన్ని తెలుసుకొని నాకు జ్ఞానోదయం చేశారు.. అది ఎప్పటికీ మర్చిపోలేను అంటూ తెలిపారు విశ్వక్ సేన్.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు