Viswaksen : ఆ యాటిట్యూడే తేడా కొట్టిందా… ఇన్‌స్టాగ్రామ్ నుంచి విశ్వక్ ఔట్?

Viswaksen : టాలీవుడ్ యంగ్ మాస్ హీరో విశ్వక్ సేన్ ఈ మధ్య సోషల్ మీడియాలో సంచలంగా మారిన సంగతి తెలిసిందే.. ఓ యూట్యూబర్ కు విశ్వక్ మధ్య పెద్ద వార్ జరిగిన విషయం తెలిసిందే.. ఆ వివాదం గత వారం రోజులు హాట్ టాపిక్ గా మారింది.. ఆ వీడియో పై సినీ ప్రముఖులు కూడా స్పందించారు.. అయితే ఇప్పుడు అందరికీ షాక్ ఇస్తూ విశ్వక్ తన ఇంస్టాగ్రామ్ కు దూరం అయ్యాడు.. ప్రస్తుతం ఈ వార్త ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది..

విశ్వక్ సేన్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన సినిమాల గురించి ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకుంటాడు.. అయితే మొన్నీ మధ్య ఓ యూట్యూబర్ పై విశ్వక్ సేన్ మండిపడ్డారు..వీడియోను షేర్ చేస్తూ సినిమా రిలీజ్ అవ్వక ముందే చెంబులు పట్టుకొని వెళ్తున్నారు మీ జేబులు నింపుకోవడానికి అంటూ విశ్వక్ అతని పై మండిపడ్డారు.. ఈ సినిమా ఇండస్ట్రీని నమ్ముకొని కొన్ని వేల కుటుంబాలు ఆధారపడి బ్రతుకుతున్నాయి అది యూట్యూబ్ లో వీడియోలు చేసేవారికి మజాక్ అయిపోయింది.. ఏది పడితే అది చెబుతారు.. మీకు దమ్ముంటే ఒక షార్ట్ ఫిలిం తీసిన వీడియోను పోస్ట్ చెయ్యండి చూస్తాను అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు..

Vishwak Sen deleted his Instagram account
Vishwak Sen deleted his Instagram account

కల్కి ట్రైలర్ పై యూట్యూబర్ చేసిన కామెంట్ పై విశ్వక్ రెస్పాండ్ అయ్యాడు.. ‘కల్కి’ ట్రైలర్ చూసి ఓపెనియన్ నెగిటివ్‌గా చెప్పాడని ఓ యూట్యూబర్‌తో సోషల్ మీడియాలో గొడవ పెట్టుకున్నాడు. ఓ రెండు మూడు రోజులు ఇది చర్చనీయాంశంగా మారింది.. ఈ వివాదంతో పాటు రీసెంట్‍గా విశ్వక్ సేన్ చేసిన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ మూవీపై కూడా విమర్శలు వచ్చాయి. బహుశా ఈ కారణంగానే ఇన్ స్టాకి దూరమయ్యాడా అనిపిస్తుంది.. ప్రస్తుతం ట్విట్టర్ ఖాతాను మాత్రమే మెయింటైన్ చేస్తున్నాడు.. ఇక సినిమాల విషయానికొస్తే.. రీసెంట్ గా గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో హిట్ టాక్ ను అందుకున్నాడు.. ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు…

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు