Tollywood : ధనం మూలం సినిమా సక్సస్

ధనం మూలం ఇదం జగత్ ఇది పెద్దలు చెప్పిన మాట.
ధనం మూలం సినిమా సక్సెస్ ఇది కొందరు దర్శకులు నమ్ముకున్న బాట.
సినిమా తీయడానికి ప్రొడ్యూసర్ దగ్గర డబ్బులు ఉండాలి.
సినిమా చూడటానికి ప్రేక్షకుడి దగ్గర డబ్బులు ఉండాలి.
సూర్యుడు చుట్టూ భూమి తిరుగుతుంది అనేది ఎంత నిజమో..
డబ్బులు చుట్టూ నేటి సమాజం తిరుగుతుంది అనేది అంతే నిజం.
ఆకలి,నిద్ర లాగా డబ్బు కూడా ఒక బేసిక్ ఎమోషన్ అయిపోయింది.

ఆ డబ్బు అనే కాన్సెప్ట్ ను పట్టుకుని సినిమాలు చేసిన చాలామంది దర్శకులు సక్సెస్ అయ్యారు. ఈవీవీ సత్యనారయణ గారు చేసిన “అమ్మో ఒక ఒకటి తారీఖు”. మధ్యతరగతి బ్రతుకులు పేదరికం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటాయో చూపించే ఈ సినిమా ఎంతోమంది ప్రేక్షకులను థియేటర్ కి నడిపించింది.

ఈ కాన్సెప్ట్ లో సినిమాలు అంటే ఇప్పటి ఆడియన్స్ కి టక్కున గుర్తొచ్చేది “ఆ నలుగురు”. కామెడీ ఇమేజ్ ఉన్న రాజేంద్రప్రసాద్ గారు ఆ పాత్రలో కనిపించి చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగించారు. అసలు ఈ సినిమా టైటిల్ చాలామందిని కదిలించింది. మనం ఎంత బాగా జీవించినా, ఎంత ధనం సంపాదించినా మనకు కావలసింది ఆ నలుగురు మనుషులే అని చూపించిన ఈ సినిమా ఇప్పటికి కళ్ళలో నీళ్లు తిరిగేలా చేస్తుంది.

- Advertisement -

కొందరు స్టార్ హీరోస్ ఎన్ని సూపర్ హిట్ సినిమాలు చేసిన వాళ్ళ కెరియర్ లో ఎప్పటికి గుర్తుండిపోయే పాత్ర ఒకటి ఉంటుంది, అలా అల్లు అర్జున్ కెరియర్ లో గుర్తుండిపోయే పాత్ర అంటే “వేదం” సినిమాలో కేబుల్ రాజు అని చెప్పొచ్చు. జూబ్లీ హిల్స్ బస్తీలో కేబుల్ ఆపరేటర్ పనిచేసే కేబుల్ రాజు పుడితే డబ్బున్న వాడిగానే పుట్టాలని ఫీలింగ్ తో బ్రతుకుతుంటాడు, ఈ సినిమాలో కనిపించే రాములు, కర్పూరం, అమలాపురం సరోజ ఈ పాత్రలన్నీ డబ్బు చుట్టూనే తిరుగుతాయి.

ఇటీవల F3 సినిమా కూడా డబ్బు కన్సెప్ట్ తోనే వచ్చి మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇలా ఒక మధ్యతరగతి వాడి డబ్బు అనే కామన్ ఎమోషన్ ను సినిమాగా మలిచిన దర్శకులు ఎక్కువ శాతం మంది సక్సెస్ అయ్యారనే చెప్పొచ్చు.

తాజాగా డబ్బు అనే కాన్సెప్ట్ తో మరో సినిమా రాబోతుంది. యంగ్ హీరో విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో దమ్కీ సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ట్రైలర్ ను బాలయ్య రెండు రోజుల క్రితం విడుదల చేశారు. ఈ ట్రైలర్ ను పరిశీలిస్తే.. జెంటిల్ మెన్, గౌతమ్ నంద సినిమాలు గుర్తు వస్తున్నాయి. ఈ సినిమాలో లాగా దమ్కీలో కూడా పేదరికంతో ఇబ్బంది పడుతున్న ఒక యువకుడు బాగా డబ్బున వ్యక్తి స్థానంలోకి వెళ్లినట్టు అర్థమవుతుంది.

“డబ్బు వచ్చకా.. వీడేంట్రా ఇల అయిపోయాడు” అనే డైలాగ్ తో డబ్బు వచ్చిన తర్వాత ఆ వ్యక్తి ఎలా మారాడు అనే అంశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటి వరకు డబ్బు కాన్సెప్ట్ పై వచ్చిన సినిమాలన్ని విజయం సాధించాయి. ఇప్పుడు దమ్కీ కూడా మంచి విజయం సాధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు