Vishwak Sen : ఏంటి విశ్వక్ అన్న సినిమాలు చేయడం మానేశారా ఏంటి…?

Vishwak Sen : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోస్ లో విశ్వక్సేన్ ఒకరు. రీసెంట్ గా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు విశ్వక్. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించని విజయాన్ని సాధించుకోలేకపోయింది. కానీ ఈ సినిమా సేఫ్ గా మాత్రం బయటపడింది అని చెప్పాలి. అయితే కృష్ణ చైతన్య దర్శకత్వంలో విశ్వక్సేన్ హీరోగా నటిస్తున్నాడు అన్నప్పుడు ఆ సినిమా పైన అంచనాలు చాలా ఏర్పడ్డాయి. కానీ ఆ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. ఈ సినిమాలో తన పర్ఫామెన్స్ తో ఆడియన్స్ ని కట్టిపడేశాడు విశ్వక్సేన్.

ఇక విశ్వక్సేన్ తన కెరియర్ మొదటి నుంచి కూడా కొత్త కథలకు ప్రాధాన్యతనిస్తూ, మంచి సినిమాలు ఎన్నుకుంటూ కెరియర్ లో ముందుకు వెళ్లాడు. విశ్వక్సేన్ చేసిన సినిమాలు ఒకదానికి ఒకటి పొంతన లేకుండా డిఫరెంట్ గా ఉంటాయి అని చెప్పొచ్చు. ఒక సినిమా కోసం విశ్వక్సేన్ చాలా కష్టపడతాడు. దాదాపు ఆరేళ్లపాటు గామి అనే ఒక సినిమాకి డేట్స్ కేటాయించాడు విశ్వక్. దీనిని బట్టి విశ్వక్ కి సినిమా పైన ఎంత ప్యాషన్ ఉంది అని అర్థం చేసుకోవచ్చు. ఇక ప్రతి సినిమాకు సంబంధించి విశ్వక్సేన్ కొద్దిపాటి వివాదాల్లో ఇన్వాల్వ్ అవుతూ ఉంటాడు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటం వలన అన్నిటికి రెస్పాండ్ అవుతుంటాడు.

Vishwak Sen

- Advertisement -

ఇకపోతే ప్రస్తుతం విశ్వక్సేన్ కొన్ని చిన్న సినిమాలు ఈవెంట్లో ఎక్కువగా కనిపిస్తున్నాడు. అయితే ప్రస్తుతం సినిమా వాల్యూ తెలుసు కాబట్టి ప్రతి సినిమాని ఎంకరేజ్ చేస్తూ వస్తున్నాడు. బండి సరోజ్ కుమార్ నటించిన పరాక్రమం టీజర్ లంచ్ కి హాజరై ఎంకరేజ్ చేశాడు. ఇక రీసెంట్ గా ప్రియదర్శి నటించిన డార్లింగ్ సినిమా ట్రైలర్ లాంచ్ కి హాజరై ఆ సినిమాను కూడా ఎంకరేజ్ చేశాడు. ఇప్పుడు ప్రస్తుతం ఆపరేషన్ రావణా అని ఒక సినిమా ట్రైలర్ లాంచ్ కి హాజరుకానున్నాడు విశ్వక్. పలాస ఫ్రేమ్ రక్షిత్ ఈ సినిమాలో మెయిన్ లీడ్ గా కనిపించనున్నాడు. ఇక వరుసగా కొన్ని ఫంక్షన్స్ లో విశ్వక్సేన్ కనిపిస్తుండడంతో సినిమాలు చేయడం మానేశావా అన్న అంటూ కొంతమంది సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు