Vishwak Sen: ఆ నటుడిని చూస్తే నాకు జలస్ ఫీల్ అనిపిస్తుంది

Vishwak Sen: తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రూవ్ చేసుకోవడానికి చాలామంది వస్తూ ఉంటారు. అయితే కొన్ని సంవత్సరాల దాటినా కూడా సరైన అవకాశం రాకుండా ఉంటుంది. అయితే కొందరికి మాత్రం కొన్ని సంవత్సరాల నిరీక్షణ తర్వాత కేవలం ఒక సినిమాతో అద్భుతమైన పేరు వస్తుంది. ఆ సినిమా అనేక అవకాశాలను తీసుకొస్తుంది. కెరియర్లో ఆ నటుడు బిజీ అయ్యేలా పనిచేస్తుంది. వచ్చిన అవకాశాలను సరిగ్గా సద్వినియోగం చేసుకుంటే హీరోగా కూడా నిలబడే ఛాన్సెస్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నాయి.

తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించిన పెళ్లిచూపులు సినిమాలో కౌశిక్ అనే పాత్రతో ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు ప్రియదర్శి. ఆ సినిమాతో ప్రియదర్శి తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మంచి ఆర్టిస్టులు పేర్కొన్నాడు. ఆ సినిమాలో ప్రియదర్శి టైమింగ్ అద్భుతమైన చెప్పొచ్చు. ఆ తర్వాత ప్రియదర్శని వెతుక్కుంటూ చాలా అవకాశాలు వచ్చాయి. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ అంచలంచలుగా ఎదిగాడు. ఈ ప్రాసెస్లో హీరోగా కూడా కొన్ని సినిమాలు చేశాడు ప్రియదర్శి.

Balagam

- Advertisement -

మల్లేశం అనే సినిమాతో హీరోగా కూడా ఎంట్రీ ఇచ్చాడు. సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి ప్రశంసలను సాధించుకుంది. ఇక వేణు దర్శకుడుగా పరిచయమైన బలగం సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాక్స్ ఆఫీస్ వద్ద ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. అలానే ఆ సినిమాకు మంచి కలెక్షన్స్ కూడా వచ్చాయి. ప్రస్తుతం ప్రియదర్శిని నటిస్తున్న సినిమా డార్లింగ్. ప్రియదర్శితోపాటు నబా నటేష్ కూడా ఈ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా ట్రైలర్ను కొద్దిగా రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ ఈవెంట్లో విశ్వక్సేన్ మాట్లాడుతూ ప్రియదర్శిని చూస్తే నాకు జలస్ ఫీలింగ్ వస్తుంది మల్లేశం, బలగం లాంటి సినిమాలు ఆయన కెరియర్ లో ఉన్నాయి అంటూ చెప్పుకొచ్చాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు