Vishwak Sen reviewer controversy: సినిమాలు ఫుల్ టైం , కాంట్రవర్సీలు పార్ట్ టైం

Vishwak Sen reviewer controversy: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోస్ లో విశ్వక్సేన్ ఒకరు. వెళ్ళిపోమాకే అనే సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు విశ్వక్. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన విజయాన్ని సాధించుకోలేకపోయింది. ఆ తర్వాత తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ నగరానికి ఏమైంది అనే సినిమాతో మంచి గుర్తింపు సాధించుకున్నాడు. ఈ సినిమా తర్వాత తనలో ఉన్న దర్శకుడిని బయటకు తీసి తన టాలెంట్ ని చూపించాడు. విశ్వక్సేన్ లో ఇంత మంచి దర్శకుడు ఉన్నాడని అందరినీ ఆశ్చర్యపరిచాడు. అయితే విశ్వక్ దర్శకత్వం వహించిన ఫలక్నామా దాస్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘనవిజయం సాధించింది. అయితే కొంతమంది సినిమా ట్రోల్ కూడా చేశారు.

Vishwaksen

అప్పుడు మొదలైన కాంట్రవర్సి

ఫలక్నామ దాస్ సినిమాకి చాలామంది పోస్టర్స్ చింపడం మొదలుపెట్టారు. అయితే దీనికి కారణం ఆ సినిమా ఈవెంట్లో “ఆల్రెడీ ఒకడిని లేపినం వాడు ఇప్పటికే నెత్తిమీద కూర్చున్నాడు అని కొందరు అంటున్నారు నేను చెబుతున్న నన్నెవరూ లేపల్సిన పనిలేదు నన్ను నేనే లేపుకుంటా” అని మాట్లాడాడు. అయితే ఈ మాటలు విజయ్ దేవరకొండ ను ఉద్దేశించి అన్నాడని చాలామంది ఫీలైపోయి విజయ్ ఫ్యాన్స్ ఈ సినిమా పోస్టర్స్ చింపారు. ఆ తర్వాత చాలామందికి ఒక ప్రెస్ మీట్ పెట్టి మరి వార్నింగ్ ఇచ్చాడు విశ్వక్సేన్.

- Advertisement -

ప్రముఖ మీడియాతో కాంట్రవర్సి

అశోక్ వనంలో అర్జున కళ్యాణం అనే సినిమాను చేసాడు విశ్వక్సేన్. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక ప్రాంక్ వీడియోను చేశారు. అయితే అదే వీడియో చాలా వివాదాస్పదంగా మారింది. ఒక ప్రముఖ ఛానల్లో ఇంటర్వ్యూలో కూర్చుని మధ్యలో నుండి వచ్చేసాడు విశ్వక్. అయితే సినిమా మాత్రం మంచి హిట్ అవడంతో సినిమా ముందు చేసిన ఈ కాంట్రవర్సీ ఏది పెద్దగా ఫోకస్ కాలేదు.

రివ్యూవర్ తో ఆర్గుమెంట్

ఇక రీసెంట్ గా విశ్వక్సేన్ నటించిన సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించినంత విజయాన్ని సాధించకపోయినా పర్వాలేదు అనిపించుకుంది. ఈ సినిమా రీసెంట్గా నెట్ఫ్లిక్స్ లోకి వచ్చింది. ఈ సినిమాని చూసి చాలామంది తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఒక ప్రముఖ రివ్యూవర్ ఈ సినిమా గురించి కొన్ని కామెంట్స్ చేశాడు. దానికి విశ్వక్సేన్ స్పందిస్తూ ముందు ఒక పది నిమిషాలు షార్ట్ ఫిలిం తీసి మాట్లాడు అంటూ కౌంటర్ చేశాడు. ఇప్పుడు ఆ రివ్యూవర్ వరుసగా విశ్వక్ తో కౌంటర్ వేసే పనిలో పడ్డాడు. ఇంటర్వ్యూలో కూర్చుని మాట్లాడుదాం అంటున్నాడు. ఏదేమైనా ఇలాంటివన్నీ విశ్వక్సేన్ కి కొత్త కాదు. ప్రతి సినిమాకు కాంట్రవర్సీ అనేది ఒక పార్ట్ అయిపోయింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు