Vishwak Sen : వచ్చే ఏడాది ‘దమ్కి’ ఇస్తాడా ?

‘వెళ్లిపోమాకే’ సినిమాతో టాలీవుడ్ కు హీరోగా పరిచయమయ్యారు విశ్వక్ సేన్. ఆ తర్వాత ‘ఈ నగరానికి ఏమైంది’ అనే సినిమా చేశారు. ఈ సినిమాలో అతడి నటనకు మంచి మార్కులు పడ్డాయి. 2019లో ‘ఫలక్ నుమా దాస్’ చిత్రంతో దర్శకుడిగా, రచయితగా, నిర్మాతగా కూడా మారారు. ఆ సినిమాలో హీరో కూడా అతనే. ఆ సినిమా విశ్వక్ సేన్ కి మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ప్రస్తుతం టాలీవుడ్ లో అగ్ర హీరోల లిస్ట్ కు వెళ్లడానికి అన్ని అర్హతలు సంపాదించుకుంటున్నాడు.

కొన్ని రోజుల క్రితం ‘దాస్ కా దమ్కి’ అనే సినిమా అనౌన్స్ చేశారు విశ్వక్ సేన్. ముందుగా ఈ సినిమాని దర్శకుడిగా నరేష్ కుప్పిలిని తీసుకున్నారు. ఆ తర్వాత ఏం జరిగిందో కానీ అతడు ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారు. దీంతో దర్శకత్వ బాధ్యతలు విశ్వక్ సేన్ చేపట్టారు. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు. అదేంటంటే, ఈ సినిమా ఫిబ్రవరి 2023 లో రిలీజ్ చేస్తున్నట్టు విశ్వక్ సేన్ అధికారికంగా ప్రకటించారు. తమిళ, తెలుగు, మలయాళం, హిందీలో రిలీజ్ చేస్తున్నారు. విశ్వక్ సేన్ గత చిత్రాలతో పోలిస్తే ఇది పెద్ద రిలీజ్ అని చెప్పాలి.

ఇక ఈ సినిమాలో విశ్వక్ సేన్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నారు. అందులో ఒకటి హీరో రోల్ కాగా, మరొకటి విలన్ రోల్ అని సమాచారం. కథ ప్రకారం, హీరో, విలన్ రెండు విశ్వక్ సేనే. కాన్సెప్ట్ ఇంట్రెస్టింగ్ గా అనిపించడంతో తన తండ్రిని నిర్మాతగా పెట్టి సినిమా చేస్తున్నారు ఈ యంగ్ హీరో. ఈ సినిమాలో నివేతా పేతురాజ్ హీరోయిన్ గా నటిస్తుండగా, లియో జేమ్స్ సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.

- Advertisement -

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు