MechanicRocky : విశ్వక్ సేన్ సినిమా మెకానిక్ రాకీ రిలీజ్ పై లేటెస్ట్ బజ్!

MechanicRocky : టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ విశ్వక్ సేన్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస ప్రాజెక్టులను లైన్లో పెట్టాడు. ఈ ఏడాది ఆల్రెడీ గామి తో హిట్ కొట్టిన విశ్వక్, గ్యాంగ్స్ అఫ్ గోదావరి సినిమాతో యావరేజ్ సినిమాని అందుకున్నాడు. ఇక ఇప్పుడు క్రేజీ సినిమాలతో ఆడియన్స్ ని అలరించడానికి రెడీ అవుతున్నాడు. రీసెంట్ గా లైలా పేరుతో ఓ సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమాలో లేడీ గెటప్ లో విశ్వక్ సేన్ నటిస్తుండడం విశేషం. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఆల్రెడీ మొదలవగా, నెక్స్ట్ గ్యాంగ్స్ అఫ్ గోదావరి తీసిన కృష్ణ చైతన్య తోనే పనిచేయనున్నాడు. ఇవే గాక మెకానిక్ రాకీ అనే మరో సినిమాను కూడా చేస్తున్నాడు.

VishwakSen MechanicRocky Movie Release update

మెకానిక్ రాకీ రిలీజ్ డేట్ అప్డేట్…

ఇక విశ్వక్ సేన్ మెకానిక్ రాకీ (MechanicRocky) సినిమా కూడా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటూ ఉండగా, లేటెస్ట్ గా ఈ సినిమా రిలీజ్ గురించి క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఈ సినిమాను ఈ ఏడాది దీపావళి కానుకగా రిలీజ్ చేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే మేకర్స్ నుండి అఫిషియల్ గా క్లారిటీ రావాల్సి ఉంది. ఇక మెకానిక్ రాకి సినిమాతో రవితేజ ముళ్ళపూడి అనే డైరెక్టర్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామ్ తాళ్లూరి దీన్ని నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా తెలుగు రాష్ట్రాల రిలీజ్ హక్కులను ఏషియన్ సురేష్ ప్రొడక్షన్స్ సంస్థలు దక్కించుకున్నాయి.

- Advertisement -

ఏడాది లోపలే మూడు సినిమాల రిలీజ్?

ఇక విశ్వక్ సేన్ ఆల్రెడీ ఈ ఇయర్ రెండు సినిమాలు రిలీజ్ చేయగా, దీపావళికి మెకానిక్ రాకి ని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అలాగే లైలా ని ఈ ఇయర్ ఎండింగ్ లో లేదా వచ్చే ఏడాది ఫిబ్రవరి లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇక కృష్ణ చైతన్య తో చేయబోయే మరో సినిమాని 2025 సమ్మర్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. అంటే ఏడాది లోపే ఈ మూడు ప్రాజెక్టులని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారన్న మాట. విశ్వక్ స్పీడు చూస్తుంటే ఇది జరిగేలానే ఉంది. కానీ రిలీజ్ టైం ని సరైన సమయం చూసుకుని రిలీజ్ చేస్తేనే నిర్మాతలకు వర్కౌట్ అవుతుంది.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు