VishwakSen : మాస్ కా దాస్ ‘లైలా’ ఓపెనింగ్ ముహూర్తం ఫిక్స్.. ఈసారి కొత్తగా

VishwakSen : టాలీవుడ్ టాలెంటెడ్ హీరోలలో ఒకరైన విశ్వక్ సేన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మాస్ కా దాస్ గా టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ తెచ్చుకున్న విశ్వక్ సేన్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. లాస్ట్ ఇయర్ దాస్ కా ధమ్కీ తో హిట్ కొట్టిన ఈ హీరో, ఈ ఇయర్ ఆల్రెడీ గామి తో మార్ సక్సెస్ ని ఖాతాలో వేసుకున్నాడు. ఇక రీసెంట్ గా గ్యాంగ్స్ అఫ్ గోదావరి సినిమాతో యావరేజ్ సక్సెస్ ని అందుకున్నాడు. ఇక ఇప్పుడు తాజాగా మరో సినిమా కూడా అనౌన్స్ చేశారు. లైలా పేరుతో తెరకెక్కబోయే తన కొత్త సినిమాని మొదలుపెట్టేస్తున్నట్టు అప్డేట్ వచ్చేసింది. ఇక ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ వారు నిర్మించబోతున్నారు. ఇక ఈ బ్యానర్ నిర్మాత సాహు గారపాటి ఎప్పట్నుంచో విశ్వక్ సేన్‌ తో సినిమా తీయాలని చర్చలు జరుపుతుండగా, తాజాగా అధికారికంగా ప్రకటించేసారు. ఈ సినిమా ప్రారంభోత్సవానికి ముహూర్తం కుదిరింది.

విశ్వక్ సేన్ లైలా ఓపెనింగ్ ముహ్హుర్తం ఫిక్స్..

ఇక విశ్వక్ సేన్ (VishwakSen) నటించబోయే కొత్త సినిమా ప్రారంభోత్సవం జూలై 3న పూజా కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఆరోజున ఉదయం 9.30 గంటలకు ఈ సినిమా ఓపెనింగ్ జరగబోతుంది. బట్టల రామస్వామి బయోపిక్ దర్శకుడు రామ్ నారాయణ్ ఈ ప్రాజెక్టుకు దర్శకత్వం వహించనున్నారని తెలుస్తుంది. ఇక విశ్వక్ సేన్ నటిస్తున్న ఈ సినిమాకు ‘లైలా’ అంటూ క్యాచీ టైటిల్ ని పెట్టడం జరిగింది. ఇక ఈ లైలా చిత్రంలో ఆకాంక్ష శర్మ కథానాయికగా నటిస్తుండగా, జిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు. ఇక విశ్వక్ సేన్ గత చిత్రం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఆశించిన విజయం సాధించలేకపోయేసరికి ఈ సినిమాతో హిట్ కొట్టాలన్న కసితో ఉన్నాడు.

వరుస సినిమాలో లైన్లో పెట్టాడు..

ఇదిలా ఉండగా విశ్వక్ సేన్ ప్రస్తుతం తన తదుపరి చిత్రం ‘మెకానిక్ రాకీ’ షూటింగ్‌లో ఉన్నాడు. రవితేజ అనే డైరెక్టర్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామ్ తాళ్లూరి దీన్ని నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో మీనాక్షి చౌదరి కథానాయిక గా నటిస్తుంది. అయితే మెకానిక్ రాకి సినిమా ముందుగా విడుదల అయ్యే అవకాశం ఉంది. మరి ఈ సినిమాలో ఏ సినిమా ముందుగా రాబోతుందో మేకర్స్ నుండే క్లారిటీ ఇస్తే తెలుస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు