Vishwambhara Update: యంగ్ డైరెక్టర్ సూపర్ స్పీడ్, మెగాస్టార్ బర్త్ డే ట్రీట్ సిద్ధం

Vishwambhara Update: భోళా శంకర్ సినిమా తర్వాత ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. బింబిసారా సినిమాతో దర్శకుడుగా పరిచయమైన వశిష్ట ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. కళ్యాణ్ రామ్ హీరోగా చేసిన బింబిసారా సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా తర్వాత కళ్యాణ్ రామ్ కి వరుసగా అవకాశాలు వచ్చాయి. ఇక రెండో సినిమాతోనే మెగాస్టార్ చిరంజీవితో చేసే అవకాశాన్ని పొందుకున్నాడు వశిష్ట. ఈ సినిమా సంక్రాంతి కనుకగా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాకి ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

అయితే మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయడం అనేది మామూలు విషయం కాదు. కానీ ఆ అవకాశం వశిష్టకు దక్కింది. ఇప్పుడు వశిష్ట స్పీడు చూస్తుంటే అందరూ ఆశ్చర్యపోతున్నారని చెప్పొచ్చు. అంత భారీ స్కేల్ సినిమాను కూడా కరెక్ట్ ప్లానింగ్ తో పూర్తి చేస్తున్నాడు. ఈ సినిమాకి సంబంధించి మాక్సిమం షూటింగ్ అయిపోయింది. అలానే ఆగస్టు 22న మెగాస్టార్ చిరంజీవి బర్త్డే ఉన్న సంగతి తెలిసిందే. బర్త్డే ట్రీట్ గా ఒక టీజర్ ని కూడా ప్లాన్ చేస్తున్నాడు వశిష్ట. ఇక విశ్వంభర విషయానికి వస్తే..

Viswambhara

- Advertisement -

విశ్వంభర టాకీ పార్ట్ పూర్తయింది. కేవలం రెండు పాటలు (హీరో ఇంట్రడక్షన్ సాంగ్ మరియు ఒక స్పెషల్ సాంగ్) మరియు క్లైమాక్స్ ఫైట్ (అన్ల్ అరసు యాక్షన్ కొరియోగ్రఫీలో) మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయి. ఆగస్ట్ నెలాఖరులోగా షూటింగ్ మొత్తం పూర్తి చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. యూనిట్ ఇటీవల 5 రోజుల పాటు బెంగళూరు వెళ్ళినప్పుడు హీరో ఇంట్రడక్షన్ సాంగ్‌ను ఎంఎం కీరవాణి కంపోజ్ చేశారు. సినిమాలో ఐదు పాటలు ఉండగా అన్నీ కంపోజ్ చేసి సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే 3 పాటలు చిత్రీకరించారు.

VFX వర్క్ మరియు ఎడిటింగ్ ఒకేసారి జరుగుతున్నాయి. సంక్రాంతి 2025కి సరైన ప్రమోషన్‌లతో సినిమాను విడుదల చేయడానికి మేకర్స్‌కి ప్లాన్ చేస్తున్నారు. ఫాంటసీ, పౌరాణిక అంశాలతో బింబిసార సినిమాతో బ్లాక్‌బస్టర్‌ను హిట్ అందుకున్న దర్శకుడు వశిష్ట మల్లిడి అంతకంటే పెద్ద కథను సిద్ధం చేసి మెగాస్టార్ తో చేసాడు. ఈ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు