Vishwanth duddumpudi : గేమ్ ఛేంజర్ లో నా రోల్ ఇదే – విశ్వంత్.. శంకర్ పర్ఫెక్షనిస్ట్

Vishwanth duddumpudi : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది. శంకర్ షణ్ముగం మొన్నటి వరకు ఇండియన్ 2 ప్రమోషన్లలో బిజీగా గడపగా, తాజాగా గేమ్ చేంజర్ సెట్స్ లో అడుగుపెట్టారు. ప్రస్తుతం రాజమండ్రిలో ఈ సినిమా పది రోజుల పాటు షూటింగ్ జరుపుకోనుందని సమాచారం. ఈ షెడ్యూల్ లో రామ్ చరణ్ తో పాటు ఈ సినిమాలో నటిస్తున్న ఎస్.జె సూర్య, సునీల్ తదితరులు షూటింగ్ లో పాల్గొనబోతున్నారని సమాచారం. ఇక ఈ సినిమా షూటింగ్ దాదాపు మూడేళ్ళుగా జరుగుతూనే ఉందన్న సంగతి తెలిసిందే. ఎప్పుడో పూర్తి కావాల్సిన ఈ సినిమా షూటింగ్ ఇంకా జరుగుతూనే ఉండడానికి కారణం ఇండియన్2 అనే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ సినిమా రిలీజ్ అయ్యే వరకు గేమ్ చేంజర్ షూటింగ్ ఓ కొలిక్కి వచ్చేలా లేదు. అయినప్పటికీ గేమ్ ఛేంజర్ కి సంబంధించిన 85 శాతానికి పైగా టాకీ పార్ట్ కూడా విజయవంతంగా పూర్తి చేసేశారని సమాచారం అందింది. ఇక, మిగిలిన పార్టును కూడా వీలైనంత త్వరగా కంప్లీట్ చేసేలా చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది. తాజాగా గేమ్ ఛేంజర్ లో నటిస్తున్న ఓ నటుడు ఆ సినిమా గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు.

Vishwanth Dudhumpudi in a key role in Game Changer

శంకర్ పర్ఫెక్షనిస్ట్ – విశ్వంత్

ఇక రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ సినిమాలో ఎంతో మంది స్టార్లు కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఇక ఈ సినిమాలో టాలీవుడ్ యంగ్ హీరో విశ్వంత్ (Vishwanth duddumpudi) కూడా నటిస్తున్నాడు. ఇతడు కేరింత, మనమంతా వంటి సినిమాల ద్వారా ప్రేక్షకులకు సుపరిచితమే. ఈ సినిమాలో రామ్ చరణ్‌కు అతడు తమ్ముడిగా కనిపించబోతున్నాడని తెలిసింది. వీళ్లిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు ఎంతో బలంగా ఉంటాయని సమాచారం. ఇక తాజా ఇంటర్వ్యూ లో గేమ్ చేంజర్ పై కొన్ని ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చాడు విశ్వంత్. ఈ సినిమా ఒక పొటెన్షియల్ ఉన్న సినిమా అని, తనకు అదృష్టం కొద్దీ దొరికిందని, ఇక దొరికిందే ఛాన్స్ అన్నట్టుగా చేసేసానని అన్నాడు. ఈ సినిమాలో తాను చాలా రోజులు నటించానని, ఇప్పుడు కూడా మొన్నే వారం కింద చెన్నై వెళ్లి షూట్ చేసుకొచ్చామని అన్నాడు. క్యారెక్టర్ చెప్పలేను గాని, శంకర్ మాత్రం ఓ పర్ఫెక్షనిస్ట్ అని ఆయన ఒక సీన్ ఇలా జరగలన్నారంటే జరిగి తీరాల్సిందే అని అన్నారు. అలాగే చరణన్న తో నటించడం నా అదృష్టమని చెప్పుకొచ్చాడు. ఇక ఈ సినిమాలో తాను ఎక్కువ సేపే ఉంటానని చెప్పుకొచ్చాడు.

- Advertisement -

రిలీజ్ డేట్ పై క్లారిటీ ఎప్పుడో?

ఇక రామ్ చరణ్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ‘గేమ్ చేంజర్’ మూవీలో కియారా అద్వాని హీరోయిన్‌ గా చేస్తోంది. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. దీనికి ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ పాన్ ఇండియా సినిమాలో శ్రీకాంత్, జయరాం, అంజలి, రాజీవ్ కనకాల, ఎస్. జె సూర్య, నవీన్ చంద్ర, సునీల్ తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు. ఇక ఈ మూవీ మొన్నటివరకు సెప్టెంబర్ 27 అనుకున్నా, ఇప్పుడు అక్టోబర్ 10 గాని 31 గాని అంటున్నారు. ఏది ఏమైనా దిల్ రాజు ఈ రిలీజ్ డేట్ పై క్లారిటీ ఎప్పుడిస్తాడో అని చరణ్ ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా నుండి ఇప్పటివరకు టీజర్ కూడా రిలీజ్ కాకపోవడం గమనార్హం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు