Viva Harsha : పెళ్ళైన కొన్నాళ్లకే ఈ కమెడియన్ కు విడాకులు?.. క్లారిటీ ఇచ్చేసాడు..

Viva Harsha : టాలీవుడ్ లో ఉన్న పాపులర్ కమెడియన్లలో హర్ష చెముడు కూడా ఒకరు. వైవా హర్షగా పాపులర్ అయిన ఈ నటుడు పన్నెండేళ్ల కింద ‘వైవా’ అనే షార్ట్ ఫిల్మ్ తో, అలాగే పలు షార్ట్ ఫిల్మ్స్ తో కమెడియన్ గా నటుడిగా మంచి ఫేమ్ సంపాదించాడు. ఆ తర్వాత మెల్లిగా సినిమాల్లో చిన్న చిన్న ఆఫర్లతో కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. మ‌సాలా, ప‌వ‌ర్‌, గోవిందుడు అందరివాడేలే, వంటి వరుస సినిమాల్లో చిన్న పాత్రలు చేస్తూ ఎదిగాడు. కలర్ ఫొటో, కార్తికేయ2, రీసెంట్ గా ప్రసన్నవదనం, సుందరం మాస్టర్ సినిమాల్లో కీలక పాత్రల్లో నటించి మెప్పించాడు. ఇదిలా ఉండగా 2021 లో వైవా హర్ష అక్షర అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. కాగా నాలుగేళ్ల పాటు ప్రేమించి పెళ్లిచేసుకున్న ఈ జంట తాజాగా విడిపోయారని సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.

Viva Harsha Chemudu gives clarity on divorce rumours

జీవితం అనేది రోలర్ కాస్ట్ రైడ్ లాంటిది

అయిత్ వైవా హర్ష (Viva Harsha) రెండు రోజుల కింద ఇంస్టాగ్రామ్ లో ఓ పోస్ట్ పెట్టాడు. ఆ పోస్ట్ లో.. “జీవితం అనేది రోలర్ కోస్టర్ రైడ్‌లా ఉంటుంది. అప్స్ అండ్ డౌన్స్, లోస్ అండ్ హైస్, ఎగ్జైట్మెంట్, యాంగ్జైటీ, భయం, థ్రిల్స్ ఇలా అన్నీ ఉంటాయి..కానీ ఏదీ మ‌న‌ కంట్రోల్‌లో ఉండదు.. మనల్ని ఆపేందుకు మ‌ధ్య‌లో ఎన్నో వస్తాయి. ఓ టైమ్ త‌ర్వాత వెళ్లిపోతాయి. ఆ రైడ్‌ను ఎంజాయ్ చేస్తుండాలి. అస‌లేది ఆశించ‌కూడ‌దు. ఆ త‌ర్వాత నిరాశ ప‌డ‌కూడ‌దు. మొత్తంగా జీవితం ఎటు వెళ్తే అటు వెళ్ల‌డ‌మే”… అంటూ పోస్ట్ పెట్టాడు. ఇక ఈ పోస్ట్ తో మొన్నటి నుండి నెట్టింట వైవా హర్షకు భార్యతో గొడవలు వచ్చాయి. ఏకంగా విడాకులు తీసుకున్నాడు అని వార్తలు వస్తున్నాయి. అసలు హ‌ర్షకు ఏమైంద‌ని నెట్టింట జనాలు ఆరాలు తీస్తూనే ఉన్నారు. అయితే హర్ష విడాకుల విషయంపై తాజాగా క్లారిటీ ఇచ్చాడు.

- Advertisement -

విడాకులపై క్లారిటీ ఇచ్చిన హర్ష..

ఇక నెట్టింట వైరల్ అవుతున్న విడాకుల వార్తలపై హర్ష చెముడు తాజాగా క్లారిటీ ఇచ్చాడు. తాజాగా ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ.. తన పర్సనల్ లైఫ్ సాఫీగానే సాగుతుంద‌ని.. చాలా హ్యాపీగా ఉన్నానని,.. కానీ పనిలో కొన్ని తెలివి తక్కువ, మెదడు లేని రాజకీయాల కారణంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని, అంతే కానీ ఇంకేం లేదని హర్ష సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. అలాగే.. ఇవన్నీ ప్రతి చోట ఉండేవే అని.. తాను హ్యాపీ గానే ఉన్నాన‌ని, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కూడా మరింత స్ట్రాంగ్ గా మళ్ళీ వ‌స్తాన‌ని, మనకు ఎదురుదెబ్బలు తగిలినా, తట్టుకుని మళ్ళీ పోరాడడం గొప్పదని, హర్ష చెముడు చెప్పుకొచ్చాడు. ఇక హర్ష చెముడు ఇచ్చిన క్లారిటీ తో విడాకుల రూమర్లకు చెక్ పడింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు