Vivek Athreya: ఒక సినిమా డిజాస్టర్ ఎక్స్పీరియన్స్ తో జాగ్రత్త పడ్డాడు

Vivek Athreya: ప్రస్తుతం ఉన్న హీరోస్ లో న్యాచురల్ స్టార్ నాని గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. జెర్సీ సినిమా తర్వాత నాని ఎంచుకున్న ప్రతి కథను కూడా ప్రేక్షకుడు విపరీతంగా ఇష్టపడుతున్నాడు. ఆడియన్స్ కి బోర్ కొట్టకుండా ఒక్కో సినిమాకి ఒక్కో లుక్ మైంటైన్ చేస్తూ మంచి ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నాడు. జెర్సీ సినిమా తర్వాత నాని చేసిన ప్రతి సినిమా కూడా ఆడియో కి ఎక్కడో కనెక్ట్ అవుతుంది అని చెప్పాలి. అయితే ఎన్నో అంచనాల మధ్య వచ్చిన అంటే సుందరానికి అనే సినిమా కమర్షియల్ గా హిట్ కాలేదు. కానీ చాలామందికి ఈ సినిమా పర్సనల్ గా చాలా ఇష్టమని చెప్పాలి. ఈ సినిమాకి సపరేట్ ఫ్యాన్స్ కూడా ఉన్నారు.

మెంటల్ మదిలో సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా పరిచయమైన వివేక్ ఆత్రేయ చేసిన మూడు సినిమాలుతో మంచి పేరును సాధించుకున్నాడు. ఇప్పుడు వివేక్ సరిపోదా శనివారం అనే సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన కంటెంట్ సినిమాపై మంచి అంచనాలను పెంచుతుంది. ఈ సినిమాతో ఎలాగైనా కమర్షియల్ హిట్ సాధించాలి అని ప్లాన్ చేస్తుంది చిత్ర యూనిట్. రిలీజ్ చేసిన ప్రతి కంటెంట్ కూడా సినిమాకి మంచి ప్లస్ అవుతుంది. ఈ సినిమాను ఆగస్టు 29న రిలీజ్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇకపోతే ఈ సినిమాకి సంబంధించి 2 గంటల 35 నిమిషాలు రన్ టైమ్ ను ఫైనల్ చేశారు. అంటే సుందరానికి సినిమా డ్యూరేషన్ కూడా ఎక్కువగా ఉండటం వల్ల పోయింది అని కొంతమంది అంటూ ఉంటారు. దానికోసమే వివేక్ ఆత్రేయ ఇప్పుడు జాగ్రత్త పడ్డాడు అని కొన్ని కామెంట్స్ వినిపిస్తున్నాయి.

Ante Sundaraniki

- Advertisement -

అంటే సుందరానికి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఇటు కాకపోయినా కూడా చాలామందికి విపరీతంగా ఆ సినిమా నచ్చింది. దాదాపు ఆ సినిమా డ్యూరేషన్ మూడు గంటల పాటు ఉన్నా కూడా కొంతమందికి అసలు బోర్ కొట్టలేదు. సినిమా ఎప్పుడు మొదలై ఎప్పుడు ఎండ్ అయిందో తెలియనంత గా చూస్తుంటారు చాలామంది ఇప్పటికే ఆ సినిమాను. ఇప్పటికీ కొంతమంది వివేక్ ఆత్రేయ తీసిన మూడు సినిమాలలో ఇది బెస్ట్ అని చెబుతూ ఉంటారు. ఏదేమైనా ఆ సినిమాతో కమర్షియల్ గా సక్సెస్ అందుకోలేకపోయారు కాబట్టి ఇప్పుడు సరిపోదా శనివారం సినిమాతో ఒక కమర్షియల్ హిట్ కొడదామని ప్లాన్ చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు