Waltair Veerayya : గ్యాంగ్ లీడర్ రేంజ్..

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ (కేఎస్ రవీంద్ర) కాంబినేషన్ లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ వాల్తేరు వీరయ్య. ఈ పక్కా కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్ మూవీలో మాస్ మహారాజా రవితేజ ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. అందాల ముద్దుగుమ్మ శృతిహాసన్ ఈ మూవీలో మెగాస్టార్ చిరంజీవి సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యుర్నేని, వై రవి శంకర్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.

రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం జనవరి 13న థియేటర్లలోకి రాబోతుంది. ఈ నేపథ్యంలో వరుస అప్డేట్లతో మూవీపై హైప్ ని క్రియేట్ చేస్తుంది మూవీ యూనిట్. ఇప్పటికే ఈ చిత్రం నుంచి “బాస్ పార్టీ..” “నువ్వు శ్రీదేవి నేను చిరంజీవి..” అనే పాటలు విడుదల చేయగా ఇప్పటికే పెద్ద హిట్స్ గా నిలిచాయి. ఇప్పుడు మూడో సింగిల్ కోసం సమయం వచ్చింది.

డిసెంబర్ 26న వాల్తేరు వీరయ్య టైటిల్ సాంగ్ ని విడుదల చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. ఇది వాల్తేరు వీరయ్య టైటిల్ సాంగ్ అని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇందుకు సంబంధించి పోస్టర్ ని విడుదల చేసి.. “పూనకాలు లోడింగ్” అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఈ పోస్టర్ లో చిరంజీవి గ్యాస్ బర్నర్ పట్టుకొని చేసిన ఆక్ట్ గ్యాంగ్ లీడర్ చిత్రాన్ని గుర్తు చేస్తోంది. దీంతో వాల్తేరు వీరయ్య లో పాత చిరంజీవి కనిపిస్తాడని మెగా ఫ్యాన్స్ మరోసారి భారీ స్థాయిలో అంచనాలు పెట్టుకుంటున్నారు.

- Advertisement -

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు