Waltair Veerayya : డాషింగ్ యాటిట్యూడ్ తో..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా యంగ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తయింది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. మెగా 154 అనే వర్కింగ్ టైటిల్ తో సినిమాను తెరకెక్కిస్తూ వచ్చారు. అయితే మళ్ళీ వింటేజ్ బాస్ చూపించి మాస్ పూనకాలు అంటే ఏంటో చూపిస్తానని యంగ్ దర్శకుడు కె ఎస్ రవీంద్ర (బాబీ) ముందు నుంచి కూడా మెగా ఫ్యాన్స్ కి అయితే ఓ బిగ్ ప్రామిస్ ని అందించాడు.

ఇక అక్కడ నుంచి ఎంతో అవైటెడ్ గా మారిన ఈ సినిమా నుంచి ఈ దీపావళి బ్లాస్ట్ గా మేకర్స్ అయితే ఫైనల్ గా టైటిల్, టీజర్ ని రిలీజ్ చేశారు. మరి దీనితో అయితే సినిమా టైటిల్ అనుకున్నట్టే “వాల్తేర్ వీరయ్య” గా అనౌన్స్ చెయ్యగా ఈ టైటిల్ టీజర్ మాత్రం వేరే లెవెల్ మాస్ గా ఉందని చెప్పాలి. బాస్ నుంచి ఎన్నో ఏళ్ళు ఎదురు చూస్తున్న ఆ మాస్ మీల్స్ అయితే దీనితో దొరికేశాయి.

బాస్ నుంచి రియల్ కం బ్యాక్ ల ఇది అని అనిపిస్తుంది. తన డాషింగ్ యాటిట్యూడ్, గ్రేస్ అన్ని బాక్సాఫీస్ దగ్గర మెగాస్టార్ అసలు సత్తా చూపించే రేంజ్ లో ఉన్నాయి. ఇక ఈ అదిరే మాస్ విజువల్స్ తో దేవి శ్రీ ప్రసాద్ ఎనర్జిటిక్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరింత స్థాయిలోకి దీనిని తీసుకెళ్ళింది. లాస్ట్ లో తన మార్క్ మాస్ దప్పుల బీట్స్ తో అయితే దుమ్ము లేచిపోయింది. ఇక ఈ మూవీని సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు