Chai Bisket Films: వెరైటీ ప్రొమోషన్లతో హైప్ పెంచుతున్న “మేం ఫేమస్”

యూట్యూబ్ ద్వారా ఫేమస్ అయిన ఛాయ్ బిస్కెట్ టీమ్ ప్రొడక్షన్ హౌస్ నుండి వస్తున్న తాజా చిత్రం “మేం ఫేమస్”. తక్కువ బడ్జెట్ తో స్టార్ నటులు లేకున్నా మంచి కామెడీ కథాంశంతో ఈ సినిమా రూపొందింది. షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ తో యూట్యూబ్ లో ఫేమస్ అయిన సుమంత్ ప్రభాస్ హీరోగా ఛాయ్ బిస్కెట్ ప్రొడక్షన్ లో తెరకెక్కింది ఈ సినిమా. విలేజ్ బ్యాక్డ్రాప్ లో ఉండబోతున్న ఈ సినిమాలో అందరు యూట్యూబ్ యాక్టర్లే నటించడం విశేషం. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పాటలు, ట్రైలర్స్ సినిమా పై ఉన్న అంచనాలను పెంచేసాయి.

ఇక ఈ చిత్ర యూనిట్ సినిమా ప్రమోషన్లను కూడా ముందు నుంచి డిఫరెంట్ గా ప్రమోట్ చేస్తూ వస్తుంది. ప్రముఖ సెలెబ్రిటీలతో పాటలు, లాంచ్ చేయించగా, రీసెంట్ గా న్యాచురల్ స్టార్ నాని తో మేం ఫేమస్ ట్రైలర్ ను రిలీజ్ చేయించారు. ఈ మధ్యనే సినిమా సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకొని క్లీన్ యూ/ఏ సర్టిఫికెట్ ను దక్కించుకుంది.

తాజాగా చిత్ర యూనిట్ సినిమా కోసం మరో డిఫరెంట్ ఆలోచనతో ప్రమోషన్లను చేపట్టింది. మే26న మేం ఫేమస్ వరల్డ్ వైడ్ గా విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా మేం ఫేమస్ సినిమా విడుదలయ్యే కొన్ని ప్రముఖ థియేటర్లలో తొలిరోజు టికెట్ రేటు కేవలం 99రూపాయలు గానే ఫిక్స్ చేసారు. ఈ అవకాశం సినిమా విడుదలయ్యే మొదటి రోజు మాత్రమే. ఈ విధంగా ఛాయ్ బిస్కెట్ టీమ్ డిఫరెంట్ గా తమ చిత్ర ప్రమోషన్లను కొనసాగిస్తోంది. ఈ సినిమాకు పబ్లిక్ లో ఉన్న హైప్ ని బట్టి కొంచెం పాజిటివ్ మౌత్ టాక్ వచ్చినా జాతి రత్నాలు, బలగం సినిమాల్లా అద్భుతమైన వసూళ్లు అందుకునే అవకాశం ఉంది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment New

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు