Nag Aswin: మహేష్ బాబు గురించి నాగ్ అశ్విన్ అలా అనేసాడు ఏంటి ?

Nag Aswin: ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా కల్కి సినిమా గురించి టాపిక్స్ నడుస్తూ ఉన్నాయి. ఒకప్పుడు మీ హీరో గొప్ప మా హీరో గొప్ప అని మాట్లాడుకున్న చాలా మంది ఇప్పుడు మాత్రం అర్జునుడు కర్ణుడు ద్రోణుడు భీష్ముడు అంటున్నారు. వీటన్నిటికీ కూడా కల్కి సినిమా కారణమని చెప్పొచ్చు. ఒక స్పీచ్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ చెప్పినట్లు ఒక మనిషిని కదిలించగలిగే శక్తి సాహిత్యానికి మాత్రమే ఉంటుంది అన్నట్లు ఒక మనిషిని కదిలించగలిగే శక్తి సినిమాకి కూడా ఉంటుంది.

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన కల్కి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇప్పటికే ఈ సినిమాకి దాదాపు 700 కోట్లకు పైగా వసూలు వచ్చాయి. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మాత అశ్విని దత్ తెరకెక్కించారు. మైథిలాజికల్ సైన్స్ ఫిక్షన్ జోనర్ లో వచ్చిన మొదటి సినిమా ఇది. ఈ సినిమాలో కమల్ హాసన్ అమితాబచ్చన్, ప్రభాస్, దీపిక పదుకొనే తో పాటు ఎంతోమంది స్టార్ కాస్ట్ నటించారు. ఈ సినిమాలో అర్జునుడు పాత్రలు విజయ్ దేవరకొండ కనిపించాడు. అలానే కల్కి 2 సినిమాలో మిగతా కొంతమందిని ఇన్వాల్వ్ చేయనున్నట్లు కూడా దర్శకుడు తెలిపాడు.

kalki 2898 ad

- Advertisement -

ఇక ఈ సినిమాకు వెళ్ళిన ఆడియన్స్ కి చాలా సర్ప్రైజెస్ ప్లాన్ చేశాడు దర్శకుడు నాగ్ అశ్విన్. ఈ సినిమాలో రాంగోపాల్ వర్మ, రాజమౌళి, అనుదీప్ కె.వి వంటి దర్శకులు కూడా అక్కడక్కడ కనిపించారు. అయితే ఈ సినిమాలు కృష్ణుడి పాత్రకి మంచి స్కోప్ ఉంది. ఈ సినిమా చూసిన తర్వాత కృష్ణుడిగా అయితే మహేష్ బాబు బాగుంటాడని సోషల్ మీడియాలో అనేక రకాలుగా చర్చలు జరిపారు. అయితే వీటిపై నాగ్ అశ్విన్ కూడా స్పందించాడు. ఖచ్చితంగా మహేష్ బాబు గారు కృష్ణుడి గెటప్ లో బాగానే ఉంటారు. కానీ ఈ సినిమాలో అది కాదు అంటూ చెప్పుకొచ్చారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు