Omkar: శివం భజే, ఓంకార్ అన్నయ్య ఏం చేయలేదా ఈ సినిమాకి ?

Omkar: ఓంకార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడైతే రియాల్టీ షోలు తగ్గించారు కానీ ఒకప్పుడు బుల్లితెరకు రియాల్టీ షో పరిచయం చేసి ఒకప్పుడు ఒక ఊపు ఊపారు ఓంకార్. దర్శకుడుగా నిర్మాతగా యాంకర్ గా చాలా రియాల్టీ షోలు చేశారు ఓంకార్. సిల్వర్ స్క్రీన్ కి మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య అయితే బుల్లితెరకు ఓంకార్ ఒక అన్నయ్యని చెప్పొచ్చు. ఓంకార్ చాలామందికి లైఫ్ ఇచ్చారు. ఓంకార్ పరిచయం చేసిన వాళ్ళు చాలామంది ఇప్పుడు ఇండస్ట్రీలో మంచి పొజిషన్లో ఉన్నారు. ఇకపోతే ఓంకార్ తమ్ముడు అశ్విన్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఓంకార్ బుల్లితెర తర్వాత జీనియస్ అనే సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమాతోనే మంచి హిట్టు అందుకొని ఇక్కడ కూడా సక్సెస్ అయ్యాడు ఓంకార్ తన మొదటి సినిమాకే చాలామందికి అవకాశాన్ని కల్పించాడు. ఆ తర్వాత ఓంకార్ చేసిన రాజుగారిగది సినిమా కూడా మంచి హిట్ అయింది. నాగార్జున లాంటి హీరోతో కూడా సినిమా చేశారు ఓంకార్. ఓంకార్ కొత్త టాలెంట్ను ఎంతలా ఎంకరేజ్ చేస్తారు అని చాలామందికి తెలిసిందే. ఇకపోతే అశ్విన్ బాబు ప్రస్తుతం శివం భజే అనే సినిమాను చేస్తున్నారు. ఈ సినిమా నేడు రిలీజ్ కి సిద్ధమవుతుంది.

Omkar

- Advertisement -

మామూలుగా అశ్విన్ బాబు సినిమా అంటే ఓంకార్ సపోర్ట్ బానే ఉంటుంది. ఆ సినిమాని ప్రమోట్ చేయడం లాంటివి చేస్తూ ఉంటారు కానీ ఈ సినిమా విషయానికి వస్తే ఓంకార్ సైలెన్స్ కనిపిస్తుంది. అయితే ఈ సినిమాకి సంబంధించి ఒక ట్వీట్ గాని ఒక పోస్ట్ గాని ఎక్కడ కనిపించలేదు. దీన్నిబట్టి చాలామందికి ఓంకార్ అన్నయ్య ఈ సినిమాకి ఏమీ చేయలేదా అంటూ డౌట్స్ కూడా మొదలయ్యాయి. ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి మారుతి, తమన్, ఎస్ కే ఎన్ హాజరయ్యారు. నేడు ప్రాక్టికల్ ముందు రాబోతున్న ఈ సినిమా ఎంతవరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు