Tharun Bhasckar: ఈ నగరానికి ఏమైంది- ఇది టైటిల్ కాదు

కొన్ని సినిమాలను చూస్తున్నప్పుడు ఆ సినిమాకి, ఆ సినిమా టైటిల్ కి అసలు సంబంధం ఏంటా అనే ఫీలింగ్ ఆడియన్స్ కి కలగడం మానదు. కొన్ని సినిమా టైటిల్స్ ఆ సినిమాకి జస్టిఫికేషన్ అనిపిస్తాయి. ఇంకొన్ని టైటిల్స్ అసలు ఒక్కదానికొకటి పొంతన లేకుండా ఉంటాయి. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన రెండవ సినిమా “ఈ నగరానికి ఏమైంది”. అసలు ఈ సినిమాకి టైటిల్ కి సంబంధం ఏంటి అని అనుకున్నారంత. కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ డిస్కషన్ ఎవరు పెట్టలేదు ఎందుకంటే సినిమా ఎంటర్టైన్ చేసింది.

కానీ ఈ సినిమా టైటిల్ “ఈ నగరానికి ఏమైంది” అనేది బాగా ఆకట్టుకుంది. జనాల్లో మంచి రీచ్ ను తీసుకొచ్చింది. దానికి కారణం ఒకప్పుడు సినిమాకి వెళ్ళిన ప్రతిసారి కూడా “ఈ నగరానికి ఏమైంది” అని ఒక యాడ్ రావడం మనకు తెలిసిందే. సో దాన్ని పట్టుకొని తరుణ్ భాస్కర్ ఆ టైటిల్ పెట్టాడు. ఆ టైటిల్ కి అనుగుణంగా “అసలు ఈ నగరానికి ఏమైంది, మందు ఉన్న కూడా ఎవరూ తాగట్లేదు” ఏంటి అని ఒక డైలాగ్ ని పెట్టాడు సో ఆ విధంగా ఒక ప్లేస్ లో టైటిల్ కి జస్టిఫికేషన్ ఇచ్చాడు.

ప్రస్తుతం తరుణ్ భాస్కర్ చేస్తున్న సినిమా “కీడాకోలా”. ఈ సినిమా నవంబర్ 3న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా కొన్ని ఆసక్తికర విషయాలను తెలిపాడు తరుణ్ భాస్కర్. అయితే “ఈ నగరానికి ఏమైంది” సినిమా మొదట టైటిల్ “కన్య రాశి” అని చెప్పుకొచ్చాడు. ఈ “కన్య రాశి” అనేది టైటిల్ గా ఎందుకు అనుకున్నాడు.? యాక్చువల్ గా సినిమాలో ఒక క్యారెక్టర్ నేను “కన్య రాశిలో పుట్టి ఉంటాను రా నేను” అని ఒక డైలాగ్ ఉంటుంది. బహుశా అందుకే “కన్యరాశి” అని పెట్టాలి అనుకున్నాడు కావచ్చు.

- Advertisement -

అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అవుతుంది అని తరుణ్ భాస్కర్ అనుకున్నాడంట. కానీ ఊహించని రీతిలో యూత్ ఈ సినిమాకి బ్రహ్మరథం పట్టారు. మొత్తానికి “ఈ నగరానికి ఏమైంది” అనే ఒక యాడ్ ని టైటిల్ గా పెట్టి సినిమాకు ఆడియన్స్ ను థియేటర్ కి రప్పించాడు.
ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కేటీఆర్ హాజరయ్యారు. ఆయన కూడా “ఈ నగరానికి ఏమైంది” అనే టైటిల్ చూసి అసలు మేము సిటీని ఇంత డెవలప్ చేస్తున్నాం కదా, “ఈ నగరానికి ఏమైంది” అనే టైటిల్ పెట్టారు ఏంటి అని భయమేసిందని అప్పట్లో చెప్పుకొచ్చారు.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు