Love me Song: లవ్ మీ మూవీ నుంచి ” ఏమవుతుందో ” సాంగ్ రిలీజ్.. ఫుల్ కిక్ ఇచ్చే విధంగా ఉందిగా..!

Love me Song: ఆశిష్.. ఈ పేరు ఈ విధంగా పలికితే పెద్దగా ఎవ్వరికి గుర్తు రాదేమో కానీ దిల్ రాజు మేనల్లుడు ఆశిష్ అని చెబితే ప్రతి ఒక్కరు ఇట్టే గుర్తు పడతారు. రౌడీ బాయ్స్ మూవీ తో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఈ హీరో సక్సెస్ అందుకోలేక పోయాడు. దీంతో చాలా సంవత్సరాల పాటు ఇండస్ట్రీకి గ్యాప్ ఇచ్చి ఇటీవలే దాంపత్య జీవితంలోకి అడుగు పెట్టాడు.

ఇక పెళ్లి అనంతరం ఓ సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు. ఆ సినిమా పేరే లవ్ మీ. బేబీ సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ అయిపోయిన వైష్ణవి చైతన్య ఈ మూవీలో హీరోయిన్గా నటిస్తుంది. ఇక ఈ చిత్రాన్ని దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ హైప్స్ ఏర్పడ్డాయి. తాజాగా ఈ సినిమా సాంగ్ ని విడుదల చేశారు.

ఏ..ఏ.. ఏమవుతుందో.. అంటూ సాగే ఈ లిరిక్స్ ప్రస్తుతం ప్రేక్షకులను బేభక్షంగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ మూవీ నీ మే 25న ప్రేక్షకుల ముందుకి తీసుకురానున్నారు. ఇక‌ ఈ సినిమాకి ఇంకా కేవలం మూడు రోజులు మాత్రమే సమయం ఉండడంతో వరుస ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు టీం. ఇక తాజాగా విడుదల చేసిన ఈ సాంగ్ ప్రజెంట్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు