Rajamouli : ప్రభాస్ సినిమాలో రాజమౌళి ఫేవరెట్ డైలాగ్ & సీన్ ఏంటో తెలుసా?

Rajamouli : టాలీవుడ్ లో మకుటం లేని మహారాజు అని దర్శక ధీరుడు రాజమౌళిని అంటారు.. ఎందుకంటే ఆయన చేసిన సినిమాలు ప్రపంచస్థాయిలో గుర్తింపును తెచ్చుకున్నాడు.. ఇప్పటివరకు రాజమౌళి తెరకేక్కించిన బాహుబలి సిరీస్ సినిమాలతో మంచి టాక్ ను అందుకున్నాడు.. ఆ తర్వాత వచ్చిన త్రిపుల్ ఆర్ సినిమాతో ఆస్కార్ అవార్డును అందుకున్నాడు.. తెలుగు చిత్రపరిశ్రమలో వెనకడుగు వెయ్యని స్టార్ డైరెక్టర్ గా వరుస సినిమాలు చేస్తూ వస్తున్నాడు.. రాజమౌళికి ప్రభాస్ అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలుసు.. అందుకు ఉదాహరణ కల్కి సినిమాలో ప్రభాస్ కోసం గెస్ట్ రోల్ చెయ్యడం..

ప్రభాస్ సినిమాలను తాను డైరెక్ట్ చెయ్యకపోయినా చూస్తానని గతంలో చాలా ఇంటర్వ్యూ లలో జక్కన్న చెప్పడం విశేషం.. ప్రభాస్ తో సినిమాలు చెయ్యక ముందు నుంచే ఆయన సినిమాలను చూసినట్లు కొన్ని సందర్భాల్లో చెప్పిన విషయం తెలిసిందే.. తాజాగా రాజమౌళి, ప్రభాస్ ఇంటర్వ్యూ వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఆ వీడియోలో ప్రభాస్ సినిమాల గురించి సంచలన విషయాలను బయట పెట్టాడు.. డార్లింగ్ నటించిన అడవి రాముడు సినిమా అందరికీ గుర్తే ఉంటుంది.. ఆ సినిమాలో ఆర్తి అగర్వాల్ తో నువ్వు ఇచ్చిన గిఫ్ట్ జీవితాంతం గుర్తు పెట్టుకుంటాను అని చెప్పే డైలాగ్ ఒకటి ఆయనకు బాగా నచ్చిందట.. ఆ సీన్ ఎప్పుడూ తన మనసులో ఫిక్స్ అయిపోయిందని చెప్పాడు.. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది..

what is Rajamouli's favorite dialogue & scene in Prabhas' movie?
what is Rajamouli’s favorite dialogue & scene in Prabhas’ movie?

ఇక వీరిద్దరి సినిమాల విషయానికొస్తే.. ప్రభాస్ ను మొదట యాక్షన్ హీరోగా చూపించింది రాజమౌళినే అని ఈ వీడియోను చూస్తే తెలుస్తుంది.. ఛత్రపతి సినిమా వీరిద్దరి కాంబోలో వచ్చి సూపర్ హిట్ టాక్ ను అందుకుంది.. ఆ తర్వాత బాహుబలి సిరీస్ సినిమాలు వచ్చాయి.. ఆ సినిమాలు ఏ రేంజులో హిట్ టాక్ ను అందుకున్నాయి తెలిసిందే.. ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు.. రీసెంట్ గా కల్కి సినిమాతో హిట్ అందుకున్నాడు.. రాజా సాబ్, స్పిరిట్, సలార్ 2 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు.. ఇక జక్కన్న మహేష్ బాబుతో సినిమా చేస్తున్నాడు.. ఆ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉంది.. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుందని టాక్..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు