Agent: ట్రైలర్ లో ఈ బ్యూటీ ఎక్కడ ?

అక్కినేని అఖిల్ హీరోగా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో వస్తున్న మూవీ ఏజెంట్. ఈ చిత్రాన్నిఏకే ఎంటర్టెన్మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర, ‘సురేందర్ 2 సినిమా’ బ్యానర్ పై సురేందర్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. హిప్-హాప్ తమిజా ఈ సినిమాకు మ్యూజిక్ అందించగా, మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ప్రత్యేక పాత్రలో కనిపిస్తున్నారు. ఇక ఏజెంట్ లో సాక్షి వైద్య అనే ముంబై కి చెందిన బ్యూటీ హీరోయిన్ గా నటిస్తుంది.

ఇక ఏప్రిల్ 18న రాత్రి 8.47 గంటలకి ఏజెంట్ మూవీ యొక్క థియేట్రికల్ ట్రైలర్ ని లాంచ్ చేశారు. భారీ యాక్షన్, స్టైలిష్ విజువల్స్ తో ఏజెంట్ ట్రైలర్ అదిరిపోయింది. ఆడియన్స్ నుండి ఈ ట్రైలర్ కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం యూట్యూబ్ ట్రెండింగ్ లో టాప్ లో రన్ అవుతున్న ట్రైలర్ 5 మిల్లియన్లకు పైగా వ్యూస్ తో దూసుకుపోతుంది.

అయితే ఏజెంట్ మూవీ లో సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తుందని తెలుసు. కానీ విడుదలైన ట్రైలర్ లో ఈ సాక్షి ఎక్కడ కనిపించలేదు. ట్రైలర్ లో కేవలం ఒక్క షాట్ లో ఒక్క సెకండ్ అలా కనిపించి కనిపించనట్లు చూపించి వదిలేసారు. మరి మూవీ లో సాక్షి అసలు ఎంత సేపు ఉంటుందో తెలీదు. ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఈ హీరోయిన్ ని కేవలం ఓ నాలుగు సీన్లు, రెండు పాటలకే పాటలకే పరిమితం చేసినట్లు అనిపిస్తోంది.

- Advertisement -

మరి ట్రైలర్ లో సాక్షిని సరిగ్గా చూపించనందుకు ఎంత ఫీలయ్యిందో గాని, సినిమాలో అయినా ఈ హీరోయిన్ కి మంచి రోల్ ఇచ్చారో లేదో ఏజెంట్ రిలీజ్ అయ్యాకే తెలుస్తుంది. ఏజెంట్ మూవీ సాక్షి వైద్య కి ఫస్ట్ మూవీ కాగా, తర్వాత వరుణ్ తేజ్ తో గాండీవ ధారి అర్జున, ఏకే ఎంటర్టైన్మెంట్స్ లో మరో సినిమా చేస్తుంది.

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు