Tollywood Actress : అమ్మబాబోయ్.. ఈ ముద్దుగుమ్మలు సినిమాల కోసం అలాంటి పనులు చేశారా?

Tollywood Actress : సినిమా ఇండస్ట్రీలో కొంతమంది తమ అభిమానులను ఆకట్టుకోవడం కోసం కొత్తగా కనిపించాలని అనుకుంటారు. అందుకోసం ఏదోకటి ఇష్టం లేకపోయినా కూడా చేస్తారు. సినిమా హిట్ అవ్వాలని వాళ్లు చేసే కొన్ని పనులు ఫ్యాన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.. కొందరు హీరోయిన్లు సినిమాలో పాత్ర డిమాండ్ చేస్తే కొత్తగా ఏదోకటి చేస్తారు. ఇప్పటికే చాలా మంది హీరోయిన్లు కొన్ని పనులు చేశారు. ఏ హీరోయిన్ సినిమా కోసం ఎలాంటి పనులు చేశారో ఇప్పుడు ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

Who are the heroines who endured pain to make movies hit?
Who are the heroines who endured pain to make movies hit?

సమంత..

సమంత పెళ్ళైన తర్వాత నటించిన సినిమా రంగస్థలం.. ఈ సినిమాలో సామ్ ఎంత న్యాచురల్ లుక్ లో కనిపిస్తుందో అందరికీ తెలిసిందే.. ఈ సినిమాలో సమంత బర్రెలు కడిగే ఒక సీన్ ఉంటుంది. ఈ సీన్ ఒక డూప్ తో కంప్లీట్ చేయిద్దాం అని అనుకున్నారు. అయితే సమంత స్టార్ హీరోయిన్ అయి ఉండి కూడా బురదలోకి దిగి బర్రెలను కడిగింది. అలాగే చెప్పులు లేకుండా నడిచింది. ఆమె చేసిన పనికి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు..

పూర్ణ..

కొడివీరన్‌ సినిమాలో గుండు కొట్టించుకుంది.. మాములుగా ఎవరైనా జుట్టును కత్తిరించుకుంటారు.. కానీ ఈమె డైరెక్ట్ గా ఆ పని చెయ్యడం విని ఫ్యాన్స్ బాగా హర్ట్ అయ్యారు. సాధారణంగా ఆమె కావాలనుకుంటే ఏదో ఒక విగ్గు పెట్టుకొని ఈ సీన్ చేయవచ్చు కానీ అది ఒక బలమైన పాత్ర అని జుట్టును తీయించుకుంది..

- Advertisement -

శ్రియా రెడ్డి..

ప్రభాస్ కు కమ్ బ్యాక్ ఇచ్చిన సినిమా అంటే సలార్ పార్ట్ 1.. ఈ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను అందుకుంది. ఆ సినిమాలో హీరోయిన్ శ్రియా రెడ్డి ప్రత్యేక పాత్రలో నటించింది. రాధా రామ పాత్రలో నటించింది. ఈ రోల్ లో ఆమె తన చెవులకు కడియాలు తొడుక్కుంది. వాటి కారణంగా ఆమె చెవులు సాగిపోయాయి.. ఆ తర్వాత సర్జరీ కూడా చేయించుకుందని టాక్..

కాంతారా హీరోయిన్ సప్తమి గౌడ కూడా సినిమా కోసం ముక్కుపుల్ల కుట్టించుకొని అందరికీ షాక్ ఇచ్చింది ఆమె ఒక పాత్ర కోసం ఇలా నొప్పిని భరించడం నిజంగా విశేషం అని చెప్పుకోవచ్చు.. ఇలా చాలా మంది హీరోయిన్లు సినిమాల కోసం నొప్పిని భరించారు. ఆ సినిమాలు సూపర్ హిట్ టాక్ ను అందుకున్నాయి..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు