Box office: ఈ సీనియర్ హీరోల్లో నెక్స్ట్ సెంచరీ కొట్టే హీరో ఎవరు?

టాలీవుడ్ లో 100 కోట్ల క్లబ్ అనేది ఇప్పుడు కామన్ అయిపొయింది. 2009 లో మగధీర సినిమా తో మొదలైన ఈ ట్రెండ్ ఇప్పుడు చిన్న హీరోల దాకా వచ్చింది. అయితే ఇండియాలో అన్ని ఇండస్ట్రీల్లోనూ గ్రాస్ కలెక్షన్ల గురించి మాట్లాడుకుంటే, తెలుగులో మాత్రం షేర్ గురించే ఎక్కువగా మాట్లాడతారు.

టాలీవుడ్ లో మొదటి 100కోట్ల షేర్ సాధించిన చిత్రం బాహుబలి. 2015 లో వచ్చిన ఈ సినిమా తెలుగులో 180 కోట్ల వరకు షేర్ సాధించింది. ఆ తర్వాత 100 కోట్ల చిత్రం రావడానికి చాలా రోజులు పట్టింది. ఆ రికార్డు మెగాస్టార్ చిరంజీవికీ దక్కింది. ఆయన హీరోగా రీ ఎంట్రీ ఇచ్చిన ఖైదీ నెంబర్ 150 మూవీ 104 కోట్లకి పైగా షేర్ వసూలు చేసింది. ఆ తర్వాత వరుసగా రంగస్థలం, సైరా ఇలా చాలా సినిమాలు వంద కోట్లు వసూలు చేసాయి. టాలీవుడ్ టాప్ హీరోలైన ప్రభాస్, రామ్ చరణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్ అందరూ వంద కోట్ల క్లబ్ లో జాయిన్ అయ్యారు. భీమ్లా నాయక్ తో చిన్న మార్జిన్ తో పవన్ కళ్యాణ్ 100 కోట్ల క్లబ్ ని మిస్ కాగా, రాబోయే సినిమాతో ఈ క్లబ్ లో చేరిపోవడం ఖాయం.

ఇక సీనియర్ స్టార్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ కూడా టాప్ హీరోలకి సమానంగా ఉంటారు. మార్కెట్ దృష్ట్యా వారితో పోటీ పడకపోయినా ఫ్యాన్ ఫాలోయింగ్ పరంగా ఇంకా టాప్ లోనే ఉంటారు. ఈ హీరోల్లో మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికే వంద కోట్ల క్లబ్ లో మూడు సార్లు చేరి టాప్ హీరోస్ తో సమానంగా ఉన్నాడు. ఆ తరువాత నందమూరి బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ ఈ ముగ్గురు 100 కోట్ల గ్రాస్ ని ఇప్పటికే అందుకున్నారు. ఇక వీరిలో 100 కోట్ల షేర్ ని సాధించే హీరో ఎవరని టాలీవుడ్ లో లెక్కలేస్తున్నారు. వీరిలో నాగార్జున ప్రస్తుతం ఫామ్ లో లేడు. కానీ క్లిక్ అవ్వడానికి ఒక్క సినిమా చాలు.

- Advertisement -

ఇక నందమూరి బాలకృష్ణ అఖండ తో 80 కోట్ల షేర్ ని, ఎఫ్2 తో వెంకటేష్ 83 కోట్ల షేర్ ని అందుకున్నారు. ప్రస్తుతం వీళ్ళు చేస్తున్న ప్రాజెక్ట్స్ కూడా భారీ స్థాయిలో తెరకెక్కుతున్నాయి. బాలకృష్ణ అనిల్ రావిపూడి తో మాస్ ఎంటర్టైనర్ సినిమా తీస్తున్నారు. ఇంకా టైటిల్ నిర్ణయించని ఈ సినిమా 2023 దసరా కానుకగా రాబోతుంది. ఇటు వెంకటేష్ “హిట్” ఫేమ్ శైలేష్ కొలను తో “సైంధవ్” సినిమా చేస్తున్నాడు. సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా క్రిస్మస్ కానుకగా రానుంది. ఈ సినిమాపై కూడా భారీ అంచనాలున్నాయి. రానున్న ఈ రెండు సినిమాలకు ఇప్పుడున్న బజ్ కారణంగా కంటెంట్ బాగుంటే 100 కోట్ల షేర్ వసూలు చేసే అవకాశం ఉంది. చూద్దాం మరి ఏ హీరో వంద కోట్ల క్లబ్ లో చేరతారో.

 

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు