BRO: అసలెవరయ్యా బ్రో? కన్ఫ్యూషన్ లో ఫ్యాన్స్.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ “బ్రో”. మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ఇందులో మరో హీరోగా నటిస్తున్నాడు. విలక్షణ నటుడు, దర్శకుడు అయిన సముద్రఖని ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. సముద్ర ఖని తాను నటించి తెరకెక్కించిన వినోదయ సితం కు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. అయితే కథలో చాలా మార్పులు చేసి “బ్రో” సినిమాను తెరకెక్కిస్తున్నారు. పైగా ఈ సినిమాకు రచనా సహకారం అందించడం వల్ల సినిమాపై భారీ హైప్ వచ్చింది.

ఇక మే18న విడుదలైన బ్రో మోషన్ పోస్టర్ లో పవన్ కళ్యాణ్ అల్ట్రా మోడ్రన్ లుక్స్ లో అదిరిపోయాడు. ఈ మోషన్ పోస్టర్ కి థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సాలిడ్ రెస్పాన్స్ ని దక్కించుకుంది. పవన్ కళ్యాణ్ స్వాగ్ లో స్టైలిష్ గా ఉన్న ఆ స్టిల్ లో వెనకాల జటాజూటం తో ఉన్న శివుడి రూపం, ఇంకా బ్రో పేరుతో కలిసి వచ్చే శ్లోకం సినిమాపై హైప్ ని భారీగా పెంచాయి.

అయితే తాజాగా “బ్రో” నుండి సాయిధరమ్ తేజ్ ఫస్ట్ లుక్ కూడా ఈరోజు రిలీజ్ అయింది. ఈ లుక్ లో వైట్ టీ షర్ట్, ప్యాంటు తో పాటు వైట్ షూస్ వేసుకుని స్టైలిష్ గా కనిపించాడు. అయితే ఈ ఫస్ట్ లుక్ తో ఫ్యాన్స్ కి ఒక కన్ఫ్యూషన్ స్టార్ట్ అయింది. పవన్ కళ్యాణ్ నటించిన “గోపాల గోపాల” సినిమా కాన్సెప్ట్ లాగానే “బ్రో” కూడా తెరకెక్కుతోందని తెలిసిందే. గోపాల గోపాల సినిమాలో పవన్ కళ్యాణ్ దేవుడిలా కనిపించడం జరిగింది. ఇప్పుడు వస్తున్న “బ్రో” సినిమాలో కూడా పవన్ అదే రోల్ లో నటిస్తున్నాడు.

- Advertisement -

అయితే ఈ రోజు విడుదలైన సాయిధరమ్ తేజ్ ఫస్ట్ లుక్ వల్ల మెగా ఫ్యాన్స్ కి ఒక సందేహం మొదలైంది. హీరోలిద్దరి పోస్టర్లు ఒకేలా లేకపోయినా, మొన్న పవన్ పై ఏ శ్లోకం మోషన్ పోస్టర్ లో ప్లే చేసారో, అదే శ్లోకం bgm ను సాయి ధరమ్ పైనా ప్లే చేసారు. అంతే కాక ఈ పోస్టర్ లో సాయిధరమ్ తేజ్ టోటల్ క్లీన్ వైట్ డ్రెస్ లో ఉండడం వల్ల అసలు దేవుడి పాత్ర చేస్తుంది పవన్ కళ్యాణా? లేదా సాయి తేజా? అనే సందిగ్ధత లో ఉన్నారు అభిమానులు. హీరోలిద్దరి మోషన్ పోస్టర్స్ చూసాక చాలా మందికి ఈ డౌటే వస్తుంది. దీని పై క్లారిటీ రావాలంటే అది చిత్ర యూనిటే వివరణ ఇవ్వాలి.

ఒకవేళ సాయి తేజ్ ని దేవుడిగా చూపించి పవన్ ని కామన్ మ్యాన్ గా చూపిస్తే ఫ్యాన్స్ అంగీకరిస్తారా అంటే కష్టమనే చెప్పాలి. అయితే “బ్రో” చిత్రానికి త్రివిక్రమ్ కూడా పనిచేస్తుండడంతో అభిమానులు కొంచెం రిలాక్స్డ్ గా ఉన్నారు. ఎందుకంటే పవన్ అంటే త్రివిక్రమ్ కు ఎంత ప్రేమో తెలిసిందే. జల్సా, అత్తారింటికి దారేది సినిమాల్లో పవన్ కళ్యాణ్ ని ఏ రేంజ్ లో ఎలివేట్ చేసాడో తెలిసిందే. మరి ఈ సినిమాలో పవన్ ని సముద్రఖని తో కలిసి ఎలా చూపిస్తాడో, ఎలాంటి డైలాగులతో తన హీరోని లేపుతాడో చూడాలి. ఇక బ్రో సినిమాను జులై 28న విడుదల చేయబోతున్నామని మేకర్స్ ఇంతకు ముందే ప్రకటించడం జరిగింది.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment New

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు