Kalki2898AD : కల్కిలో ఈ రెండు ప్రతిష్ఠాత్మకమైన పాత్రల్లో నటించింది ఎవరో?

Kalki2898AD : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన కల్కి2898AD సినిమా మరో మూడు రోజుల్లో వరల్డ్ వైడ్ గా విడుదల కానున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాపై ప్రభాస్ అభిమానులతో పాటు మూవీ లవర్స్ లోనూ భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాకి మైథలాజికల్ టచ్ కూడా ఇవ్వడం వల్ల సాధారణ ప్రేక్షకులు సైతం ఈ సినిమా గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక నాగ్ అశ్విన్ ఈ సినిమాను రెండున్నరేళ్ల పాటు తెరకెక్కించగా, వైజయంతి మూవీస్ బ్యానర్ లో అశ్వినిదత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించడం జరిగింది. ఇక కల్కి2898AD నుండి రిలీజ్ అయిన టీజర్ గాని, ట్రైలర్ గాని సినిమాపై ఓ రేంజ్ లో అంచనాలని పెంచేసాయి. దానికి తోడు గత రెండు వారాలుగా కల్కి కి సంబంధించి ఏదో ఒక అప్డేట్ ఇస్తూ, సినిమాని ప్రమోట్ చేస్తూ ఉన్నారు మేకర్స్. ఇటీవల ముంబైలో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయగా, వరుస ఇంటర్వ్యూ లలోనూ పాల్గొంటున్నారని సమాచారం. ఇదిలా ఉండగా కల్కి (Kalki2898AD) సినిమా గురించి ఓ ఆసక్తికరమైన చర్చ సోషల్ మీడియాలో నడుస్తుంది.

Who played the roles of Srikrishna and Arjuna in the movie Kalki2898AD?

ఆ రెండు ప్రతిష్టాత్మకమైన పాత్రలు చేసింది ఎవరో?

కల్కి2898AD సినిమాకు మైథలాజికల్ టచ్ ఇస్తూ, మహాభారతానికి సంబంధించి అశ్వద్ధామ పాత్రను నేటితరానికి పరిచయం చేస్తున్నాడు నాగ్ అశ్విన్. ఇక ఈ అశ్వద్ధామ పాత్రలో అమితాబ్ బచ్చన్ నటించిన విషయం తెలిసిందే. అయితే ట్రైలర్లలో అశ్వద్ధామ పాత్ర మహాభారత యుద్ధంలో పాల్గొన్న సందర్భాన్ని చూపించడం జరిగింది. ఇక అశ్వద్ధామ కి సంబంధించి మహాభారత యుద్ధంలోని అశ్వద్ధామ యుద్ధం ముగిసాక ఏం చేశాడన్న విషయం సినిమాలో చూపించబోతున్నాడని తెలుస్తుంది. ఇక అందిన సమాచారం ప్రకారం ఆ కాలానికి సంబంధించి దాదాపు 15 నుండి 20 నిమిషాల వరకూ మహాభారతం లోని సీన్లు ఉండొచ్చట. అయితే మహాభారతంలో అశ్వద్ధామ పాత్రకి సంబంధమున్న కీలకమైన రెండు ప్రతిష్టాత్మక పాత్రల్లో ఎవరు నటిస్తున్నారన్న విషయం ఆసక్తిగా మారింది. ఆ పాత్రలు ఏవి అంటే.. అశ్వద్ధామని శపించిన శ్రీ కృష్ణుడి పాత్ర, అలాగే అశ్వద్ధామతో యుద్ధం చేసిన అర్జునుడి పాత్ర. అశ్వద్ధామ పాత్రకి ముడిపడి ఉన్న ఈ పాత్రలు రెండు కూడా కీలకమే.

- Advertisement -

Who played the roles of Srikrishna and Arjuna in the movie Kalki2898AD?

ఈ పాత్రల్లో ఈ హీరోలు ఉండే ఛాన్స్ ఉందా?

ఇక మహాభారతం లో అశ్వద్ధామ కురువంశాన్ని నాశనం చేద్దామని అభిమన్యుడి భార్య అయిన ఉత్తర గర్భంలో పెరుగుతున్న పరీక్షిత్ వైపు బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తాడు. అప్పుడు అర్జునుడు దాన్ని ఎదురించగా, శ్రీ కృష్ణుడు ఆగ్రహంతో అశ్వద్ధామని కలియుగాంతం వరకూ కురూపిగా ఉండమని శపిస్తాడు. అలాగే ఉత్తర శిశువుని తన యోగమాయతో బతికిస్తాడు. ఇంత కీలకమైన పాత్రల్ని ఎవరు చేస్తారా అని ఆసక్తి నెలకొని ఉంది. అసలు ఈ పాత్రల్ని కల్కి లో చూపిస్తారా అనే సందేహం కూడా ఉంది. అయితే ఆ పాత్రలు కల్కిలో చూపిస్తే, బహుశా కొన్ని రోజుల నుండి కల్కి లో నాని, దుల్కర్ సల్మాన్ లు నటిస్తున్నట్టు చర్చ జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ ఇద్దరు నటులు కల్కి లో శ్రీకృష్ణార్జునులుగా నటించే అవకాశం ఉన్నట్టు సమాచారం. మరి కల్కి లో ఈ పాత్రలు ఉన్నాయా లేవా? ఉంటె ఎవరు నటించారో అన్న విషయంపై క్లారిటీ రావాలంటే మరికొన్ని జూన్ 27వరకు ఆగాల్సిందే.

 

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు