Kalki: శ్రీకృష్ణుడు రోల్ ఎవరు చేయట్లేదు – నాగ్ అశ్విన్

Kalki: ప్రస్తుతం ఎక్కడ చూసినా కల్కి సినిమా గురించి టాపిక్ వినిపిస్తూ వస్తుంది. ఆ సినిమాను మైథలాజికల్ సైన్స్ ఫిక్షన్ జోనర్ లో తెరకెక్కించాడు దర్శకుడు నాగ్ అశ్విన్. ఇకపోతే ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు నుంచి పాజిటివ్ టాక్ తో అద్భుతమైన కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ వద్ద తన ప్రభంజనాన్ని చూపిస్తుంది. భారీ బడ్జెట్ తో ఈ సినిమాని అశ్విని దత్ నిర్మించారు. మామూలుగా ఈ సినిమాకు సంబంధించి ఒక కొత్త ప్రపంచాన్ని చూపించారు దర్శక నిర్మాతలు. ఈ సినిమాకు సంబంధించి ప్రతిదీ క్రియేట్ చేసుకుంటూ వచ్చారు.

ఇకపోతే దర్శకుడు నాకు అశ్విని ఇప్పటివరకు మూడు సినిమాలను తెరకెక్కించారు. తన రెండవ సినిమా మహానటి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక కథను ఇలా కూడా చెప్పొచ్చు అని ప్రేక్షకులని ఆశ్చర్యపరిచి ప్రేక్షకులను థియేటర్ కు పరుగులు పెట్టేలా చేశారు. మహానటి సావిత్రి గారి జీవిత చరిత్రను అద్భుతంగా కళ్ళల్లో నీళ్లు తెప్పించేలా మనసుకు హత్తుకునేలా తీశారు. అటువంటి దర్శకుడు నుంచి కల్కి లాంటి నెక్స్ట్ లెవెల్ సినిమా వచ్చింది అని అంటే అందరూ ఆశ్చర్యపోయారు కూడా, ఇకపోతే మహానటి సినిమాలో చాలామంది దర్శకులు వివిధ పాత్రలలో కనిపిస్తారు. కల్కి సినిమాలో కూడా కొంతమంది దర్శకులు కొన్ని పాత్రల్లో కనిపించారు.

Kalki 2898 AD

- Advertisement -

కల్కి సినిమాలో ఎస్.ఎస్ రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ, అనుదీప్ కె.వి వంటి అందరూ దర్శకులు దర్శనమిచ్చారు. ఇకపోతే థియేటర్కు వెళ్లిన ప్రేక్షకులకి వాళ్ళని చూడగానే కొంచెం సప్రైజ్ ఫీల్ వచ్చింది. ఇకపోతే అర్జునుడు పాత్రలో విజయ్ దేవరకొండ కూడా కనిపించి మంచి హై ఇచ్చాడు. అయితే ఈ సినిమాలో కృష్ణుడి పాత్ర కూడా ఒకటి ఉంది. కృష్ణుడు పాత్రకు సంబంధించి ఆయనను పెద్దగా రివీల్ చేయలేదు. అయితే కృష్ణుడు పాత్ర వాస్తవానికి ఈ సినిమాలో ఎవరు చేయడం లేదట. ఫస్ట్ పార్ట్ లో కృష్ణుడిని ఎలా చూపించారో అలానే సినిమా అంతట్లో కూడా కృష్ణుడిని అలానే చూపించినట్లు నాగ్ అశ్విన్ తెలిపారు. అయితే కృష్ణుడు పాత్రలో మహేష్ బాబు చేస్తే బాగుంటుంది అని సోషల్ మీడియాలో కొన్ని ఫొటోస్ కూడా వైరల్ అయ్యాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు