Mass Maharaja: రవితేజ చేసే ప్రయోగాలు ఎందుకు క్లిక్ అవ్వట్లేదు..?

మాస్ మహారాజ రవితేజ అనగానే మాస్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ సినిమాలు గుర్తుకొస్తాయి. 21వ శతాద్భపు తొలినాళ్లలో వరుస హిట్స్ తో మినిమమ్ గ్యారెంటీ హీరోగా ఒక వెలుగు వెలిగాడు రవితేజ. కామెడీ టచ్ ఉన్న క్యారెక్టర్లే కాకుండా సీరియస్ క్యారెక్టర్లు కూడా చేయగలనని నిరూపించుకునేందుకు రవితేజ అడపాదడపా ప్రయత్నిస్తూనే ఉన్నప్పటికీ ప్రేక్షకులు ఆ సినిమాలను తిరస్కరిస్తున్నారు. అప్పట్లో వచ్చిన షాక్ మొదలుకొని నా ఆటోగ్రాఫ్, నేనింతే, సారొచ్చారు వంటి సినిమాలు రవితేజ జోన్ నుండి బయటకు వచ్చి ప్రయత్నించినవే. అయితే అవేవి బాక్సాఫీస్ వద్ద మెప్పించలేక పోయాయి.

రవితేజ చేసిన ప్రయోగాల్లో ప్రయత్న లోపం లేనప్పటికీ, ప్రేక్షకులు ఎందుకో మాస్ పాత్రల్లో తప్ప రవితేజను యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. తాజాగా విడుదలైన రావణాసుర కూడా ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. రావణాసురలో నెగిటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్ చేసాడు రవితేజ, డైరెక్టర్ సుధీర్ వర్మ ఈ సినిమాను మితిమీరిన వైలెన్స్ తో బూతు డైలాగ్స్ తో నింపేయటంతో ప్రేక్షకులు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు అంటూ టాక్ వినిపిస్తోంది. ప్రయోగాత్మక చిత్రాలు చేస్తే తిరస్కరిస్తున్న ఆడియెన్స్ ఒకానొక సమయంలో రవితేజ నుండి రొటీన్ సినిమాలే వస్తున్నాయి కొత్తదనం లేదంటూ అభిప్రాయపడ్డ రోజులు కూడా ఉన్నాయి.

ఇక్కడ ప్రేక్షకులది మాత్రమే తప్పని చెప్పలేం. ప్రయోగాత్మక సినిమాలు చేసినా, రొటీన్ సినిమాలు చేసినా సినిమాలో మ్యాటర్ ఉంటే జనాలు ఆదరిస్తారు. రవితేజ గత చిత్రాలు క్రాక్, ధమాకా ఇందుకు నిదర్శనం. ఎలాంటి పాత్రల్లో అయినా ఒదిగిపోగల పొటెన్షియాలిటీ ఉన్న నటుడు రవితేజ కేవలం మాస్ పాత్రలకే పరిమితం అవ్వటం బాధాకరం. మొత్తానికి రావణాసుర లాంటి ప్రయోగాత్మక చిత్రం ద్వారా అనుకున్న రీతిలో మెప్పించలేకపోయిన రవితేజ రాబోతున్న టైగర్ నాగేశ్వరావు సినిమాతో అయినా మెప్పిస్తాడో లేదో చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు