Nag Aswin : హీరోను మించిన ఎలివేషన్ విజయ్‌కి నాగి ఎందుకు ఇస్తాడు… కారణమిదేనా…?

Nag Aswin: ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా కల్కి సినిమా గురించి వినిపిస్తూ వస్తుంది. అయితే జూన్ 27న రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘన విజయాన్ని సృష్టించింది. భారీ బడ్జెట్ తో ఈ సినిమాని అశ్విని దత్ నిర్మించారు. దాదాపు 600 కోట్లకు పైగా సినిమా కోసం ఖర్చు పెట్టారు. మొదటి రోజు ఈ సినిమాకి 191 కోట్లు వసూళ్లు వచ్చాయి. ఈ సినిమాకి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో అర్జునుడి పాత్రలో కనిపించాడు విజయ్ దేవరకొండ. దీనిపై సోషల్ మీడియాలో చాలా డిష్కసన్స్ మొదలు అయ్యాయి.

ఇప్పటివరకు నాగ్ అశ్విన్ మూడు సినిమాలకు దర్శకత్వం వహించాడు. ఈ మూడు సినిమాల్లో కూడా కీలకపాత్రలలో కనిపించాడు విజయ్ దేవరకొండ. విజయ్ దేవరకొండకు ఒక ప్రత్యేకమైన ఎంట్రీ సీన్ ఉంటుంది. నాగి దర్శకుడిగా పరిచయమైన మొదటి సినిమా ఎవడే సుబ్రహ్మణ్యం. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా అద్భుతమైన ఘన విజయాన్ని సాధించింది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ పాత్ర చాలా ప్రత్యేకంగా ఉంటుంది అని చెప్పొచ్చు. విజయ్ దేవరకొండ పైనే సినిమా కూడా నడుస్తుంది.

నాగి దర్శకత్వం వహించిన రెండవ సినిమా మహానటి. కీర్తి సురేష్ నటించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే కొన్ని సినిమాలకు డబ్బులు వస్తాయి ఇంకొన్ని సినిమాలకు ప్రశంసలు వస్తాయి. కానీ డబ్బులుతో పాటు ప్రశంసలు వచ్చేసి సినిమాలు చాలా తక్కువగా ఉంటాయి. అందులో మహానటి సినిమా ఒకటి అని చెప్పొచ్చు. ఈ సినిమాలో కూడా విజయ్ దేవరకొండ ఒక కీలక పాత్రలో కనిపించాడు.

- Advertisement -

ఇక నాగి దర్శకత్వం వహించిన మూడవ సినిమా కల్కి. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ప్రస్తుతం కలక్షన్స్ వర్షం కురిపిస్తుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పుడు ఒక సంచలనం అని చెప్పొచ్చు. ఎక్కడ చూసినా ఇదే సినిమా గురించి టాపిక్స్ నడుస్తున్నాయి. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ అర్జునుడి పాత్రలో కనిపించాడు. అయితే ఇప్పటివరకు గమనిస్తే నాగి చేసిన అన్ని సినిమాల్లో కూడా విజయ్ కి మంచి ఎలివేషన్ ఇచ్చాడు. అయితే ఇంత మంచి క్యారెక్టర్స్ విజయ్ కు ఇవ్వడానికి కారణం వారి మధ్య ఉన్న ఫ్రెండ్స్షిప్ అని చెప్పొచ్చు.

Vijay devarakonda

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లైఫ్ ఇజ్ బ్యూటిఫుల్ సినిమాలో ఒక పాత్రలో కనిపించాడు విజయ్ దేవరకొండ. అక్కడ నాగి అశ్విన్ అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసేవాడు. అక్కడితో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి అది ఫ్రెండ్షిప్ గా మారి ఈరోజు ప్రతి సినిమాలో ఒక రోల్ చేసే విధంగా విజయ్ ను ఎంకరేజ్ చేస్తున్నాడు నాగి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు