Kanguva : కంగువ సినిమాపై అంత కాన్ఫిడెన్స్ ఎందుకు.?

Kanguva : కోలీవుడ్లో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా సినిమాల్లో కంగువ ఒకటి. ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. ఒకప్పుడు సినిమాటోగ్రాఫర్ గా కెరియర్ మొదలుపెట్టిన శివ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగులో దర్శకుడుగా కొన్ని సినిమాలు చేసినా కూడా తమిళ్లో వరుస సూపర్ హిట్ సినిమాలు చేసి స్టార్ డైరెక్టర్గా అక్కడ పేరు సాధించాడు శివ. చివరగా రజనీకాంత్ తీసిన అన్నత్తే సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చిన శివ ఇప్పుడు పాన్ ఇండియా సినిమాతో మరోసారి ప్రేక్షకులు ముందుకు రానున్నాడు. అయితే ఈ సినిమా పైన అందరికీ మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన కంటెంట్ కూడా అదే స్థాయిలో ఉంది అని చెప్పొచ్చు.

అయితే ఈ సినిమా గురించి ఈ సినిమాకి సంబంధించిన టెక్నీషియన్స్ తో పాటు దర్శకుడు, నిర్మాత జ్ఞానవేల్ రాజా వీళ్లంతా కూడా అప్డేట్స్ ఇస్తూ వస్తున్నారు. ఇక రీసెంట్ గా నిర్మాత జ్ఞానవేల్ రాజా మాట్లాడుతూ కంగువ సినిమా తో పాటు చాలా సినిమాలు రిలీజ్ అవ్వచ్చు కానీ కంగువ పార్ట్ 2 వచ్చినప్పుడు మాత్రం చాలా సినిమాలు ఈ సినిమాతో పాటు రిలీజ్ అవ్వడానికి భయపడతాయి అని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. అంటే కంగువ సినిమా ఎలా ఉండబోతుందో తెలియదు కాబట్టి ఈ సినిమాతో కూడా పోటీ పడడానికి రెడీగా ఉంటారు. ఒకవేళ ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత బ్లాక్ బస్టర్ అయితే ఈ సినిమా సీక్వెల్ తో పాటుగా మరో సినిమా రిలీజ్ అవ్వడానికి అంత ధైర్యం చూపించదు అని నిర్మాత ఉద్దేశం.

Kanguva

- Advertisement -

 

ఇకపోతే తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీలో ఇప్పటివరకు సరైన పాన్ ఇండియా ఫిలిం లేదు. 1000 కోట్ల సినిమా కూడా లేదు. కానీ చాలామంది యంగ్ దర్శకులు సీనియర్ హీరోస్తో మంచి అద్భుతమైన హిట్ సినిమాలు చేస్తున్నారు అని చెప్పాలి. ఇప్పటికే కమల్ హాసన్ హీరోగా విక్రమ్ సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు లోకేష్. అలానే రజనీకాంత్ హీరోగా జైలర్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు నెల్సన్. 1000 కోట్లు సినిమా తమిళ్లో లేకపోయినా కూడా మంచి టాలెంటెడ్ దర్శకులు ఉన్నారని ప్రూవ్ అవుతూ వచ్చింది.

ఇకపోతే అట్లీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు జవాన్ సినిమాతో 1000 కోట్ల హిట్ అందుకున్నాడు. ఇక నెక్స్ట్ తమిళ్ లో సినిమా చేస్తే పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేసి మరో ఈ కోట్ల సినిమా తన ఖాతాలో వేసే ప్లాన్ లో ఉన్నాడు అట్లీ. ఇక చాలామంది తమిళ్ ఆడియన్స్ తో పాటు తమిళ్ సినిమా ప్రేమికులు చెప్పే విషయం ఏమిటంటే తమిళ్ నుంచి వస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా సినిమా కంగువా అంటూ చెబుతున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు