RANA : రానాకే ఎందుకిలా..?

దగ్గుబాటి రానా.. టాలీవుడ్ లో పరిచయం అక్కర్లేని పేరు. “లీడర్” సినిమాతో తెలుగు చిత్ర సీమకు ఎంట్రి ఇచ్చిన రానా, వైవిధ్యభరితమైన పాత్రలో నటిస్తూ, తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. “లీడర్, బాహుబలి, ఘాజీ, విరాట పర్వం” తో పాటు మరెన్నో సినిమాల్లో రానా డిఫరెంట్ పాత్రల్లో ప్రేక్షకులకు కనిపించాడు. పాత్ర ఏదైనా దానిలో ఒదిగిపోవడం రానాకే సాధ్యం. అయితే రానా సినిమాలకు ఓ మైనస్ పాయింట్ వెంటాడుతూనే ఉంది. ఆయన సినిమాలు ఏదో ఒక్క కారణంతో వాయిదా పడుతూ వస్తున్నాయి.

2016 లో స్టార్ట్ అయిన “1945” మూవీ దాదాపు ఏడేళ్ల తర్వాత, ఈ ఏడాది జనవరి 7న రిలీజ్ అయింది. నిర్మాత రాజ రాజన్ – హీరో రానా మధ్య వివాదం కారణంగా ఈ మూవీ షూటింగ్ అసంపూర్తిగానే ముగిసింది. చివరికి అలాగే రిలీజ్ చేసేశారు.
వేణు ఉడుగుల దర్శకత్వంలో రానా “విరాట పర్వం” సినిమా చేసిన విషయం తెలిసిందే. సురేష్ బాబు నిర్మిస్తున్న ఈ మూవీలో సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ 2019లో స్టార్ట్ అయి, 2020లో రిలీజ్ కావాల్సింది. కానీ, ఇప్పటి వరకు విడుదలకు నోచుకోలేదు. వచ్చే నెల 1న రిలీజ్ చేస్తామని మూవీ యూనిట్ అనౌన్స్ చేసింది. అయితే థియేటర్స్ లో కనిపించేంత వరకు నమ్మడం కష్టమేనని సినీ లవర్స్ అంటున్నారు. అలాగే “అరణ్య” మూవీ కూడా షూటింగ్ పూర్తి అయ్యాకా, దాదాపు ఏడాది పాటు వాయిదా పడుతూ వచ్చింది.

ఇదిలా ఉండగా, డైరెక్టర్ గుణ శేఖర్ – రానా కాంబోలో “హిరణ్య కశ్యప” సినిమా వస్తుందని, దీనికి నిర్మాతగా సురేష్ బాబు అని వార్తలు వచ్చాయి. ఈ మూవీలో రానా ను రావణాసురుడి పాత్రలో గుణ శేఖర్ చూపించాలనుకున్నాడట. నిర్మాతకు ఈ స్టోరీ నచ్చలేదని సమాచారం. స్టోరీలో పలు మార్పులు చేయాలని గుణశేఖర్ కు సురేష్ బాబు సూచించారట.

- Advertisement -

దీనికి గుణ శేఖర్ అంగీకరించకపోవడంతో ఈ ప్రాజెక్ట్ కు బ్రేకులు పడ్డాయని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్. అయితే గుణశేఖర్ ప్రస్తుతం సమంతతో “శాకుంతలం” చేస్తున్నాడు. ఈ మూవీని దిల్ రాజ్ నిర్మిస్తున్నాడు. ఈ మూవీ హిట్ అయితే, “హిరణ్య కశ్యప” ను దిల్ రాజ్ నిర్మించడానికి రెడీగా ఉన్నట్టు తెలుస్తుంది. దీంతో సమంతపైనే రానా మూవీ ఆధారపడి ఉందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు