RRR : ఆస్కార్ ఎందుకు

అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ కల్పిత కథతో రూపుదిద్దుకున్న సినిమా “ఆర్.ఆర్.ఆర్”. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంది. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రలు పోషించారు. అల్లూరి సీతారామరాజుగా చరణ్, కొమరం భీమ్ గా తారక్ నటించి మెప్పించారు. ఈ సినిమా చూసిన తర్వాత హాలీవుడ్ సైతం సలాం అంటూ ప్రశంసల వర్షం కురిపించింది. ఈ ఏడాది ఆస్కార్ బరిలోనూ ఆర్.ఆర్.ఆర్ హవా కొనసాగనుందంటూ ఓ హాలీవుడ్ మ్యాగజైన్ కొనియాడింది.

కానీ ఈ సినిమా ఆస్కార్ కు నామినేట్ కాకపోవడంపై రకరకాల విమర్శలు తలెత్తుతున్నాయి. తాజాగా హీరో నిఖిల్ ఈ విషయంపై స్పందించారు. ఆర్.ఆర్.ఆర్ సినిమాకు ఆస్కార్ ఎందుకంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజలు ఒక సినిమాపై చూపించే ప్రేమ, అభిమానం ఆ సినిమాకు ఆస్కార్ కంటే గొప్పదని అన్నారు.

ఓ ప్రముఖ మీడియా సంస్థతో నిఖిల్ మాట్లాడుతూ.. “నన్ను క్షమించండి. నాకు ఆస్కార్ పై వేరే అభిప్రాయం ఉంది. నా దృష్టిలో ప్రజల ప్రేమను పొందటమే అతిపెద్ద అవార్డు. ప్రపంచవ్యాప్తంగా ఆర్. ఆర్.ఆర్ సినిమాకు వచ్చిన ఆదరణ గొప్ప విజయం. ఆస్కార్ కు అంత ప్రాముఖ్యత ఇవ్వాల్సిన పనిలేదు. నేను అయితే ఇవ్వను. విడుదలైన అన్నిచోట్ల భారతీయ సినిమాలు దూసుకుపోతున్నాయి. నేను స్పెయిన్ లో RRR సినిమా చూశాను. థియేటర్లు అన్ని హౌస్ ఫుల్ గా ఉన్నాయి. స్పానిష్ ప్రజలు సినిమా చూడడానికి మళ్లీమళ్లీ సినిమా హాలుకు వస్తున్నారు. ఇక మనకు ఆస్కార్ నుంచి ఎలాంటి సర్టిఫికెట్ అవసరం లేదు”. అని చెప్పుకొచ్చాడు. అయితే నిఖిల్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు