Thaar Maar Thakkar Maar : మరి ఎందుకు తీశారు ?

మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా విజయదశమి కానుకగా అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే ప్రమోషన్లను ప్రారంభించిన మూవీ టీం.. బుధవారం అనంతపురంలో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా నిర్వంహించారు. దీనికి కొద్ది గంటల ముందు గాడ్ ఫాదర్ ట్రైలర్ ను యూట్యూబ్ లో ప్రేక్షకుల ముందకు తీసుకుచ్చారు. ఈ ట్రైలర్ మాస్ ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యేలా ఉంది. దీనికి ముందు వచ్చిన తార్ మార్ తక్కర్ మార్, నజభజజర వంటి పాటలు కూడా సినిమాపై కొంత వరకు హైప్ ను క్రియేట్ చేస్తున్నాయి.

ఇందులో తార్ మార్ తక్కర్ మార్ సాంగ్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, మెగాస్టార్ చిరంజీవి ఒకే ఫ్రేమ్ లో స్టెప్స్ వేయడంతో సాంగ్ కు మంచి పాపులారిటీ వచ్చింది. ఈ సాంగ్ వచ్చే నేపథ్యం కూడా ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించేలా ఉంటుందని అందరూ భావించారు. కానీ, అనూహ్యంగా ఈ మాస్ సాంగ్ సినిమాలో కాకుండా ఎండ్ రోలింగ్ టైటిల్స్ సమయంలో వస్తుందని కన్ఫామ్ అయింది.

నిజానికి ఈ సాంగ్ సినిమాలో ఉండదని గత మూడు రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలను ఎవరూ కూడా పెద్దగా నమ్మలేదు. తమ అభిమాన హీరోలు వేసే స్టెప్ లను ఖచ్చితంగా చూడాలని అనుకున్నారు. కానీ బుధవారం జరిగిన గాడ్ ఫాదర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో స్వయంగా మెగాస్టార్ ఈ మాస్ సాంగ్ పై క్లారిటీ ఇచ్చారు. ఇది ఎండ్ రోలింగ్ టైటిల్స్ సమయంలోనే వస్తుందని చెప్పారు. దీంతో మెగా ఫ్యాన్స్ కొంత వరకు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

ఎండ్ రోలింగ్ టైటిల్స్ లో వేయడానికే అయితే ఈ సాంగ్ ఎందుకు షూట్ చేశారంటూ ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా.. ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సాంగ్ సినిమాలో లేదు అనేది మాత్రం అధికారికంగా తెలిసిపోయింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు