Comedian Ali : ఈ కమెడియన్‌కి ఇది పరీక్షా టైం… వేరే ఆప్షన్ లేదు పాస్ అయి తీరాల్సిందే

Comedian Ali : టాలీవుడ్ స్టార్ కమెడియన్ అలీ నాలుగు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో కమెడియన్ గా కొనసాగుతున్న అలీ పలు సినిమాల్లో హీరోగా కూడా నటించాడు. ఎన్నో డిఫరెంట్ పాత్రల్లో అద్భుతమైన కామెడీ కూడా పండించాడు. కొందరు దర్శకులైతే అలీ కోసం సినిమాతో సంబంధం లేకున్నా సెపరేట్ కామెడీ ట్రాక్ రాసేవాళ్ళు. అలాంటి వాళ్లలో పూరి జగన్నాథ్ ఒకరు. పూరి ఫస్ట్ సినిమా బద్రి మొదలుకొని ఇప్పటివరకు తన ప్రతి సినిమాలో అలీ ఉండేవాడు. మధ్యలో ఓ రెండు మూడు సినిమాలు మినహా, పూరి అన్ని సినిమాల్లో అలీ ఉంటాడు. ఇక పూరి జగన్నాథ్ సినిమాల్లో ఆయన పాత్ర పేర్లు, గెటప్స్ సరికొత్తగా ఉండేలా చూసుకుంటాడు. కథతో సంబంధం లేకపోయినా అలీతో సెపరేట్ ట్రాక్ రాయిస్తాడు పూరి. అలాగే పోకిరి, చిరుత లాంటి సినిమాలో అలీ క్యారెక్టర్లు సూపర్ గా వర్కౌట్ అయ్యాయి.

Will Comedian Ali Come Back With Double iSmart Movie?

ఆలీ కి పరీక్షా సమయం..

ఇక అసలు విషయానికి వస్తే… ఈ మధ్య కాలంలో అలీ నుండి సరైన కామెడీ పేలడం లేదన్న విషయం తెలిసిందే. దర్శకులకు సరిగ్గా వాడుకోవడం తెలికనో, లేక కొత్త కమెడియన్ల ఊపు వల్లో అలీ ఈ మధ్య అంతగా ఆడియన్స్ ని ఆకట్టుకోవడం లేదు. దానికన్నా ఈ సీనియర్ కమెడియన్ ని అంతగా వాడుకోవడం తెలియట్లేదేమో అనాలి. అయితే డబుల్ ఇస్మార్ట్ సినిమాతో మరికొన్ని రోజుల్లో ఆడియన్స్ ని పలకరించనున్న పూరి ఆ సినిమాలో అలీకి సెపరేట్ కామెడీ ట్రాక్ రాసాడు. ట్రైలర్ లో ‘ఏ లబాడే’ అంటూ అలీ ఒక డిఫరెంట్ లాంగ్వేజ్ లో డైలాగ్స్ చెబుతూ, విచిత్రమైన గెటప్ లో ఆకట్టుకుంటున్నాడు. ‘డ‌బుల్ ఇస్మార్ట్’ ట్రైలర్ లో అలీని చూసి గ్ర‌హంత‌ర వాసి గా కనిపిస్తున్నారా ఏంటి అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే అమెజాన్ ఫారెస్ట్ లో మాట్లాడుకునే ఒక భాషను కనిపెట్టి పూరీ జగన్నాధ్ తన కోసం ఈ క్రేజీ క్యారెక్టర్‌ను క్రియేట్ చేసారని అలీ ట్రైలర్ లాంచ్ లో చెప్పుకొచ్చారు.

- Advertisement -

ఈ సినిమాతో ట్రాక్ లో పడతాడా?

ఇక చిత్ర యూనిట్ నుండి వచ్చిన సమాచారం ప్రకారం, అలీ కామెడీ ట్రాక్ సినిమాలో బాగా పేలింద‌ని, ఆయన వెరైటీ బాడీ లాంగ్వేజ్, డైలాగ్స్, చేష్ట‌లు థియేటర్లలో నవ్వులు తెప్పిస్తాయని టాక్. అయితే డబుల్ ఇస్మార్ట్ స్టోరీకి దీనికి ఏ సంబంధం ఉండదని రామ్ పోతినేని ఈవెంట్ లో తెలిపాడు. అయితే పూర్తిగా ఆక్షన్ మోడ్ లో ఉండే ఈ సినిమాలో ఎంటర్టైన్ చేసేది అలీ మాత్రమే అని అంటున్నారు. ఇక అలీ – పూరి జగన్నాథ్ కామెడీ సక్సెస్ ట్రాక్ ని బట్టి ఈ సినిమాతో అలీ మళ్ళీ కం బ్యాక్ ఇస్తాడని అంటున్నారు నెటిజన్లు. ఇక ట్రేడ్ విశ్లేషకులు కూడా ఈ మధ్య జనాల్లో అలీ కాస్త నెగిటివ్ అయ్యాడని, పాత్రలు కూడా అంత ఆసక్తికరంగా ఉండడం లేదని, కమెడియన్ గా కొనసాగాలంటే ఈసారి డబుల్ ఇస్మార్ట్ తో పాస్ అయి తీరాల్సిందే అని కామెంట్స్ చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు