Vijay Deverakonda’s Family Star: టెలివిజన్ ప్రీమియర్ కు సిద్ధమైన ఫ్యామిలీ స్టార్, థియేటర్ లో దక్కని ఆదరణ టీవీలో దక్కుతుందా.?

Vijay Deverakonda’s Family Star: నువ్విలా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ వంటి సినిమాలను చిన్న చిన్న పాత్రలో కనిపించి తనకంటూ ఒక గుర్తింపును సాధించాడు విజయ్ దేవరకొండ. ఆ తర్వాత ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో ఒక కీలక పాత్రలో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకున్నాడు. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన పెళ్లిచూపులు సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమాతోనే ఫ్యామిలీ ఆడియన్స్ అందరికీ బాగా దగ్గర అయిపోయాడు విజయ్. తక్కువ బడ్జెట్లో తెరకెక్కించిన ఈ సినిమా అద్భుతమైన ఘన విజయాన్ని సాధించి విజయ్ ను హీరోగా నిలబెట్టింది.

Arjun Reddy

అర్జున్ రెడ్డి సినిమాతో స్టార్

పెళ్లిచూపులు సినిమాతో మంచి గుర్తింపు సాధించుకున్న విజయ్ కి అర్జున్ రెడ్డి సినిమా మంచి ప్లస్ అయింది. అర్జున్ రెడ్డి అనే పాత్రలు జీవించేసాడు. అసలు విజయ్ తప్ప ఇంకొక ఈ సినిమాను చేయలేరు అనే విధంగా ఆ సినిమాలో నటించాడు విజయ్. అక్కడితో వరుస అవకాశాలను విజయ్ దేవరకొండ పొందుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన గీత గోవిందం టాక్సీవాలా వంటి సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించాయి. ఆ సినిమాలు మినహాయిస్తే మిగతా వచ్చిన సినిమాలన్నీ కూడా నిరాశను మిగిల్చాయి అని చెప్పొచ్చు.

- Advertisement -

ఫ్యామిలీ స్టార్ పరిస్థితి ఏంటి

యువత సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు పరశురాం. మొదటి సినిమా తోని తన టాలెంట్ ని బయటపెట్టి ఇండస్ట్రీలో దర్శకుడుగా నిలబడ్డాడు. తర్వాత సోలో గీతగోవిందం వంటి సినిమాలు పరశురామ్ కి మంచి పేరును తీసుకొచ్చాయి. మహేష్ బాబు హీరోగా చేసిన సర్కారు వారి పాట సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమా తర్వాత నాగచైతన్య తో పరశురాం సినిమా చేస్తాడు అనే వార్తలు కూడా వినిపించాయి. కానీ ఆ సినిమా ఎందుకో అర్ధాంతరంగా ఆగిపోయింది. ఆ తర్వాత విజయ్ హీరోగా ఫ్యామిలీ స్టార్ అనే సినిమాను తెరకెక్కించాడు. ఎన్నో అంచనాలతో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన విజయాన్ని అందుకోలేకపోయింది.

టీవీలో ఆదరిస్తారా

వాస్తవానికి ఫ్యామిలీ స్టార్ సినిమా బాగానే ఉంటుంది. కానీ థియేటర్లో చూసిన చాలామందికి ఈ సినిమా పెద్దగా ఎక్కలేదు. ఇది థియేటర్లో ఆదరణ సాధించిన ఎన్నో సినిమాలు టీవీలు మంచి టిఆర్పి రేటింగ్ను నమోదు చేశాయి. అలా మంచి టిఆర్పి రేటింగ్ను నమోదు చేయగలిగే సామర్థ్యం ఉన్న సినిమా ఫ్యామిలీ స్టార్ అని చెప్పొచ్చు. ఈ సినిమా జూన్ 16న మాటీవీలో ప్రసారం కానుంది. ఈ సినిమాకి రెస్పాన్స్ ఎలా ఉంటుందో ఆ రేటింగ్స్ బయట పడిన తర్వాత తెలుస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు