Prince – Sardar : మెప్పించి.. నిలుస్తారా ?

కొన్ని రోజుల క్రితం ఏ హీరో అయినా, ఆయన ఉండే భాష ప్రేక్షకులకు మాత్రమే హీరో. ఎన్ని సినిమాలు చేసినా, ఆ ప్రేక్షకులే చూసేవారు. పక్క భాష ప్రేక్షకులకు సంబంధమే ఉండేది కాదు. కానీ ప్రస్తుతం సీన్ మారింది. ఒక హీరోను అన్ని రాష్ట్రాల ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ప్రభాస్, రామ్ చరణ్, తారక్ లాంటి హీరోలకు ఇతర దేశాల్లో కూడా అభిమానులు ఉన్నారు. అంతలా మారిపోయింది సినిమా ప్రపంచం. దీన్ని అనుకూలంగా తీసుకుని హీరోలు అందరూ అన్ని భాషల్లో ప్రేక్షకాధరణ పొందాలని చూస్తున్నారు.

అందుకు తమ సినిమాలను అన్ని భాషల్లోనూ విడుదల చేస్తున్నారు. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులు సినిమా స్టోరీ బాగుంటే ఆ హీరోకు ఈజీగా కనెక్ట్ అవుతారు. అందుకే తెలుగు ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకుని తమిళ, మలయాళ, బాలీవుడ్ హీరోలు తమ సినిమాలను తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. అంతే కాకుండా డైరెక్ట్ గా తెలుగులో సినిమాలు చూస్తున్నారు. ప్రస్తుతం దీవాళికి కోలీవుడ్ కు చెందిన శివ కార్తికేయన్, కార్తి టాలీవుడ్ లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

శివ కార్తికేయన్, కార్తి ఇప్పటికే తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులు. వీరు నటించిన చాలా సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాయి. ఆయా సినిమాలు తెలుగు ప్రేక్షకులను మెప్పించాయి. ఇందులో శివకార్తికేయన్ ప్రిన్స్ అనే సినిమాతో దీవాళికి వస్తున్నాడు. ఇది ద్విభాషా చిత్రం. ఇప్పటి వరకు శివకార్తికేయన్ కేవలం తమిళ సినిమాల్లోనే నటించాడు. తొలిసారి తెలుగు సినిమా చేస్తున్నాడు. ఒక వేళ ఈ సినిమా హిట్ అయితే మరిన్ని తెలుగు సినిమాలు చేసే అవకాశం ఉంది.

- Advertisement -

అలాగే కార్తి ఈ దీవాళి సర్దార్ అనే సినిమాతో తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులు ఆధరిస్తే.. కార్తి కూడా డైరెక్ట్ తెలుగు సినిమా చేసే ఛాన్స్ లు ఉన్నాయి. మరి ఈ దీవాళికి తెలుగు ప్రేక్షకులు ఏ తమిళ హీరోను ఆదరిస్తారో.. చూడాలి మరి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు