SJ Surya – Pawan Kalyan పవన్ కళ్యాణ్‌తో ఎస్ జే సూర్య మూవీ… ఈ స్టోరీ అయితే తెలుగు స్టేట్స్ ఊగిపోవడం ఖాయం..

SJ Surya – Pawan Kalyan : ఎస్ జే సూర్య పేరుకు పెద్దగా పరిచయాలు అక్కర్లేదు.. డైరెక్టర్ గా సినిమాలను తెరకేక్కించడంతో పాటుగా నటుడుగా, విలన్ గా ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించాడు.. ఈయన తెలుగు ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని అన్న సంగతి తెలిసిందే.. పవన్ తో సినిమాలు కూడా చేశాడు.. వీరిద్దరి కాంబోలో ఖుషి, కొమరం పులి సినిమాలు వచ్చాయి.. ఆ సినిమాలు మంచి హిట్ టాక్ ను అందుకున్నాయి.. అందులో ఖుషి మూవీ బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యింది.. వీరిద్దరి కాంబోలో మరొక సినిమా వస్తే బాగుండు అని ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు.. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఏపీకి డిప్యుటీ సీఎం గా వ్యవహారిస్తున్నారు.. ఈ పరిస్థితుల్లో ఎలాంటి సినిమాలను జనాలు ఆదరిస్తారో చూడాలి..

సోషల్ మెసేజ్ సినిమాలు..

పవన్ కళ్యాణ్ గతంలో ఎన్నో సినిమాలతో మెసేజ్ లను ఇచ్చారు.. ఉదాహరణకు వకీల్ సాబ్, భీమ్లా నాయక్ వంటి సినిమాలు మంచి మెసేజ్ ను ఇచ్చే సినిమాలు.. ఇప్పుడు పవన్ ఉన్న పొజిషన్ లో అలాంటి సినిమాలు చేస్తే పెద్దగా పట్టించుకోరని టాక్.. తన చేతుల్లో అధికారం ఉంది ఏదైన చెయ్యొచ్చు అనే కామెంట్స్ వస్తాయని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు..

Will SJ Surya do similar films with Pawan Kalyan?
Will SJ Surya do similar films with Pawan Kalyan?

ఎంటర్టైన్మెంట్ సినిమాలు..

పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఎక్కువగా లవ్ అండ్ ఎంటర్టైన్మెంట్ సినిమాలే ఉన్నాయి.. ఖుషి, తమ్ముడు, బద్రి, అత్తారింటికి దారేది సినిమాలు జనాలను బాగా ఆకట్టుకున్నాయి.. కడుపుబ్బా నవ్వించే సీన్స్ తో పాటుగా ఫ్యామిలీ కథ చిత్రాలుగా వచ్చాయి.. ఆ సినిమాలు ఇప్పటిలో పవన్ కళ్యాణ్ తీస్తే బాగోదని ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు.. ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన ఇలాంటి సినిమాలు తీస్తే జనాలు పట్టించుకోరని, వ్యతిరేకత వచ్చే అవకాశాలు ఉన్నాయని టాక్..

- Advertisement -

పోలీస్ సినిమాలు..

పవన్ కళ్యాణ్ ముక్కు సూటి మనిషి.. ట్రెండ్ ను ఫాలో అవ్వడం కాదు.. ట్రెండ్ ను సెట్ చేస్తాడు.. అందుకే ఆయనను చాలా యువత ఆదర్శంగా తీసుకోవడంతో పాటు దేవుడుగా భావిస్తారు.. ఆయనను ఎక్కువగా పోలీస్ పాత్రల్లోనే చూడాలని అనుకుంటారు.. ఇప్పటివరకు పవన్ కొమరం పులి, గబ్బర్ సింగ్, సర్దార్ గబ్బర్ సింగ్, భీమ్లా నాయక్ సినిమాలు ఉన్నాయి.. రానున్న రోజుల్లో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఉంది.. ఇలాంటి సినిమాలను చేస్తే ప్రజలు కొంతవరకు చూస్తారని అభిప్రాయం.. సమాజాన్ని రక్షించినట్లు అవుతుందని అంటున్నారు..

పొలిటికల్ సినిమాలు..

పవన్ కళ్యాణ్ అంటే పోలీస్ పాత్రలకు కేరాఫ్.. ఈయన చేసిన సినిమాల్లో ఎక్కువగా ఇవే ఉన్నాయి.. అయితే పొలిటికల్ సినిమాలు అంతగా రాలేదు.. ప్రస్తుతం డిప్యూటీ సీఎం కాబట్టి ఇలాంటి సినిమాలు చేసి మెసేజ్ లు ఇస్తే బెటర్ అని మెగా ఫ్యాన్స్ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.. ఇలాంటి సినిమాలకు డిమాండ్ కూడా ఎక్కువే..

గ్యాంగ్స్ స్టర్ సినిమాలు..

గ్యాంగ్స్ స్టర్ గా ప్రస్తుతం రాబోతున్న సినిమా ఓజీ.. ఇలాంటి సినిమాలు చెయ్యాలని పవన్ ఆసక్తి కనబరుస్తారు.. గతంలో చాలా ఇంటర్వ్యూలలో ఇలాంటి సినిమాలను చేస్తానని చెప్పాడు.. అయితే ఇప్పుడు ఏపీలో రక్తపాతాలు జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో ఒక డిప్యూటీ సీఎం అలాంటి సినిమాలు చేస్తారంటే జనాలు యాసెప్ట్ చెయ్యరు.. రాజకీయ కేరీర్ పై ఎఫెక్ట్ పట్టే అవకాశాలు ఉన్నాయి.. మొత్తంగా చూసుకుంటే పోలీస్, పొలిటికల్ సినిమాలు చేస్తే జనాలు ఆదరిస్తారని తెలుస్తుంది.. మరి వీరిద్దరి కాంబోలో అలాంటి సినిమా వస్తుందేమో చూడాలి.. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి.. ఆ సినిమాలకే టైం కేటాయించలేకున్నారని తెలిసిందే.. మరి కొత్త సినిమా అంటే ఆలోచించాల్సిన విషయమే..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు