Tollywood : ఏడేళ్ల కిందటి సీన్ రిపీట్ చేస్తున్న నందమూరి – మెగా ఫ్యామిలీ స్టార్స్? సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా?

Tollywood : టాలీవుడ్ లో మెగా – నందమూరి ఫ్యామిలీల సినిమాలకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందన్న సంగతి తెలిసిందే. మూడున్నర దశాబ్దాలుగా ఈ రెండు ఫ్యామిలీల చుట్టే ఎక్కువ రికార్డులు గాని, వివాదాలు గాని ఉంటాయని అంటుంటారు. ఇదిలా ఉండగా తెలుగు ఇండస్ట్రీలో సెంటిమెంట్లకు కొదవలేదు. కాంబినేషన్ సెంటిమెంట్, పండగల సెంటిమెంట్, టైటిల్ సెంటిమెంట్స్, టైమింగ్ సెంటిమెంట్స్ ఇలా రకరకాల సెంటిమెంట్లతో సక్సెస్ లు కొడుతుంటారు దర్శక నిర్మాతలు. అలాగే అందులో ఫెయిల్ అవుతూ ఉంటాయి కూడా. ఇకపోతే ఈ ఏడాది చివరి నుండి మెగా – నందమూరి సినిమాలు వరుసగా రిలీజ్ కాబోతున్నాయి. ఎన్టీఆర్ రామ్ చరణ్, అలాగే చిరంజీవి, బాలకృష్ణ సినిమాలు వరుస బెట్టి విడుదలవుతున్నాయి. అయితే అనుకోకుండా ఏడేళ్ల కిందటి సీన్ రిపీట్ అవుతుందని అంటున్నారు టాలీవుడ్ (Tollywood) వర్గాలు.

Will the Mega - Nandamuri sentiment be repeated in Tollywood?

ఏడేళ్ల కింద మెగా నందమూరి హీరోల వరుస సక్సెస్ లు…

ఇక సరిగ్గా ఏడేళ్ల కింద మెగా – నందమూరి హీరోలైన ఎన్టీఆర్ , రామ్ చరణ్, చిరంజీవి, బాలయ్య వరుసగా సక్సెస్ లు కొట్టి ఇండస్ట్రీని కళకళలాడేలా చేసారు. ముందుగా 2016 సెప్టెంబర్ లో ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ సినిమాతో సక్సెస్ కొట్టగా, డిసెంబర్ లో రామ్ చరణ్ ధ్రువ తో వచ్చి హిట్టు కొట్టాడు. ఆ తర్వాత 2017 సంక్రాంతికి చిరంజీవి రీ ఎంట్రీ సినిమా ఖైదీ నెం1 తో గ్రాండ్ సక్సెస్ కొట్టగా, బాలకృష్ణ గౌతమి పుత్ర శాతకర్ణి తో సక్సెస్ సాధించాడు. ఈ నాలుగు సినిమాలు ఆయా సినిమాల రేంజ్ ని బట్టి విజయం సాధించాయి. ఇప్పుడు సరిగ్గా ఇలాగే, ఆర్డర్ లో మరోసారి వీరి కొత్త సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి.

- Advertisement -

సెంటిమెంట్ రిపీట్ అవుద్దా?

2024 లో కూడా ఏడేళ్ల కిందటి సీన్ రిపీట్ చేస్తున్నారు మెగా నందమూరి హీరోలు. ఎన్టీఆర్ సెప్టెంబర్ లో ‘దేవర’ తో వస్తుంటే, రామ్ చరణ్ డిసెంబర్ లో ‘గేమ్ ఛేంజర్’ తో వస్తున్నాడు. అలాగే 2025 సంక్రాంతికి చిరంజీవి ‘విశ్వంభర’ సినిమాతో వస్తుంటే, బాలకృష్ణ బాబీతో చేస్తున్న ‘NBK109’ తో వస్తున్నాడు. ఈ సినిమాలపై మంచి క్రేజీ ఉంది. ఇప్పుడు కూడా ఏడేళ్ల కిందటి సక్సెస్ సెంటిమెంట్ రిపీట్ అవుతుందని సోషల్ మీడియాలో ఈ కంటెంట్ ని వైరల్ చేస్తున్నారు ఫ్యాన్స్. మరి ఎన్నో అంచనాలతో రాబోతున్న ఈ సినిమాలు అభిమానులని ఎలా అలరిస్తాయో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు