Pushpa 2 : పుష్ప సినిమా రీ షూట్ అనుకున్న టైం కి రిలీజ్ అవుతుందా.?

Pushpa 2 Update : ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో రాబోతున్న హై ఎక్స్పెక్టేషన్స్ సినిమాలలో పుష్ప ఒకటి. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అల్లు అర్జున్ ని సరైన రీతిలో చూపించి బాక్సాఫీస్ ని షేక్ చేశాడు సుకుమార్. సుకుమార్ కెరియర్ లో ఇప్పటివరకు వచ్చిన బెస్ట్ ఫిలిమ్స్ లో పుష్ప ఒకటి అని చెప్పొచ్చు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపును తీసుకొచ్చి పెట్టింది. ఎస్ఎస్ రాజమౌళి తర్వాత తెలుగు సినిమాకి అంతటి గుర్తింపు ఈ సినిమాతోనే వచ్చింది.

Pushpa 2

ఇది ఈ సినిమాకి సీక్వెల్ గా పుష్పా 2తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పుష్ప 2 సినిమా పైన కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను ఆగస్టు 15న రిలీజ్ చేయబోతున్నట్లు ఇదివరకే అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఈ సినిమా నుంచి రెండు పాటలను కూడా రిలీజ్ చేసింది చిత్రం యూనిట్. ఈ రెండు పాటలు కూడా ఇప్పుడు మంచి చాట్ బస్టర్ అయ్యాయి. ఎక్కడ విన్నా ఇవే పాటలు వినిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా ఇవే పాటలు గురించి మాట్లాడుకుంటున్నారు. ఈ రెండు పాటలను చంద్ర బోస్ రచించారు. దేవిశ్రీప్రసాద్ కంపోజింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అది సుకుమార్ సినిమా అంటే వేరే లెవెల్ మ్యూజిక్ అందిస్తాడు.

- Advertisement -

ఇకపోతే ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న టైంలో ఈ చిత్ర యూనిట్ రెండు వేరువేరు ప్రాంతాల్లో షూటింగ్ జరుపుతున్నట్లు సమాచారం వినిపిస్తుంది. ఇకపోతే సుకుమార్ ఈ సినిమాకు సంబంధించి ఇంకొన్ని సీన్స్ ను యాడ్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనికోసం ఈ సినిమా ఇంకా రీషూట్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే పుష్ప సినిమా రిలీజ్ కి ఎక్కువ రోజులు టైం లేదు. ఈ టైంలో రీ షూట్ పెట్టుకుంటే అనుకున్న టైం కి సినిమా వస్తుందా లేదా అని చాలామంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా ఇదే డేట్ కి వచ్చి తీరుతామంటూ టీ ఇదివరకే చాలాసార్లు క్లారిటీ ఇస్తూ వచ్చింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు