Trisha: రీఎంట్రీలో అయినా వర్కౌట్ అవుతుందా? లేక మరో నయన్ అవుతుందా?

Trisha: చెన్నై చిన్నది త్రిష దాదాపు పుష్కర కాలం తర్వాత బాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. మరి ఈ అమ్మడికి రీఎంట్రీ అయినా వర్కౌట్ అవుతుందా? లేదంటే ఇండస్ట్రీలో మరో నయనతారగా మిగిలి పోతుందా? గతంలో నయనతార నటించిన బాలీవుడ్ మూవీ ఏంటి? దాని ఫలితం ఏంటి?

“లియో” అనే తమిళ సినిమాతో ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న త్రిష కోలీవుడ్లోకి అదిరిపోయే కం బ్యాక్ ఇచ్చింది. ఇక తాజాగా వస్తున్న రూమర్స్ చూస్తుంటే త్రిష ఫేట్ మారిపోయినట్టుగా కనిపిస్తోంది. త్రిషకు బాలీవుడ్ లో ఓ బంపర్ ఆఫర్ తగిలినట్టు సమాచారం. 13 ఏళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత హిందీలో మూవీ చేయడానికి ఈ బ్యూటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే అది కూడా ఏదో సాదాసీదా హీరోతో కాదు సల్మాన్ ఖాన్ తో రొమాన్స్ చేయడానికి రెడీ అవుతోంది.

గతంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో పంజా అనే మూవీని తెరకెక్కించిన డైరెక్టర్ విష్ణువర్ధన్ దర్శకత్వంలో ఈ మూవీ రూపొందనుంది. “ది బుల్” అనే టైటిల్ తో తెరకెక్కబోతున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం సౌత్ లో అగ్ర హీరోయిన్ గా హవా కొనసాగిస్తున్న త్రిష ఇక్కడ ఉన్న సీనియర్ హీరోలు అందరితో ఆడిపాడింది. అయితే త్రిష హిందీలో చాలా ఏళ్ల క్రితమే ఓ సినిమా చేసింది. కానీ ఆ తర్వాత బాలీవుడ్ వైపు తిరిగి చూడలేదు. ఇంతకీ త్రిష చేసిన బాలీవుడ్ మూవీ ఏంటంటే…

- Advertisement -

2010లో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ హీరోగా నటించిన “కట్టా మీటా” మూవీతో త్రిష బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే అప్పట్లోనే ఈ మూవీ ప్లాఫ్ అవడంతో బాలీవుడ్ దర్శక నిర్మాతలు ఎవరూ త్రిష వైపు తిరిగి చూడలేదు. ఇక త్రిష కూడా బాలీవుడ్ పై ఆశలు వదిలేసుకుని సౌత్ పైనే కాన్సన్ట్రేట్ చేసింది. ఈ సీనియర్ డ్యూటీ కి ప్రస్తుతం సౌత్ లో ఉన్న క్రేజ్ ఏంటో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఈ బ్యూటీ మరింత అందంగా తయారవుతుంది. అలాగే ఆమె ఫ్యాన్ బేస్ కూడా రోజురోజుకు ఎక్కువవుతుంది. ప్రస్తుతం త్రిష కు ఉన్న క్రేజ్ తో భారీ ఆఫర్లు అందుకుంటుంది. ఈ నేపథ్యంలోనే బాలీవుడ్లో ఆమె మళ్లీ రీఎంట్రీ ఇస్తుండడం ఆసక్తికరంగా మారింది. ఇక ఈ మూవీని కరణ్ జోహార్ నిర్మిస్తున్నాడు. దాదాపు 25 ఏళ్ల తర్వాత సల్మాన్ ఖాన్, కరణ్ జోహార్ కాంబోలో రూపొందునున్న మూవీ ఇదే కావడం విశేషం.

మరి ఈ రీఎంట్రీ తోనైనా త్రిష ఈసారి బాలీవుడ్ లో నిలదొక్కుకుంటుందా? లేదంటే లాస్ట్ టైం లాగే ఒక్క మూవీతోనే తట్టా బుట్టా సర్దుకుని వెనక్కి వచ్చేస్తుందా? అనేది ఆసక్తికరంగా మారింది. అయితే త్రిషను చూస్తుంటే నయనతార బాటలోనే నడుస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఇటీవల నయనతార “జవాన్” మూవీతో హిందీలో కూడా బ్లాక్ బస్టర్ ఎంట్రీ ఇచ్చింది. కానీ జవాన్ మూవీ విడుదలై చాలా కాలం అయిపోతున్నప్పటికీ బాలీవుడ్ నుంచి ఇప్పటిదాకా ఒక్క ఆఫర్ కూడా రాలేదు. మరి ఈ నేపథ్యంలోనే బాలీవుడ్ కు రీఎంట్రీ ఇస్తున్న త్రిష విషయంలో కూడా ఇలాగే జరుగుతుందా? అనే చర్చ నడుస్తోంది.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు