Trivikram: ఆమె వల్లే త్రివిక్రమ్ సేవ్ అవుతున్నారా..పెద్ద కథే..!

ఒకప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీలో డైరెక్టర్ త్రివిక్రమ్ నుంచి సినిమా వస్తుందంటే చాలు ప్రేక్షకులలో విపరీతమైన హైప్ ఏర్పడుతూ ఉండేది. మొదటి రోజు నుంచి ఈయన సినిమా చూడడానికి ప్రేక్షకులు చాలా ఆసక్తిగా చూస్తూ ఉండేవారు. అలా త్రివిక్రమ్ రైటర్ గా పనిచేస్తున్నప్పుడు ఎన్నో సక్సెస్ లను అందుకున్నారు. ఆ తర్వాత డైరెక్టర్ గా మారి పలు సినిమాలను తెరకెక్కించి భారీ విజయాలను అందుకున్నారు. కానీ ఇప్పుడు తాజాగా త్రివిక్రమ్ సినిమాల మీద ఫోకస్ తగ్గిందనే వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే ఇటీవలే మహేష్ నటించిన గుంటూరు కారం సినిమా చూస్తే అర్థమవుతుందని పలువురు అభిమానులు సైతం తెలుపుతున్నారు. ఈ సినిమా చాలా మంది ప్రేక్షకులకు పెద్దగా ఎక్కడం లేదని, అందుకు కారణం త్రివిక్రమ్ మార్క్ సినిమాలో లేదని అలాగే రొటీన్ స్టోరీగా సాగే సినిమా కావడం వల్లే ఈ సినిమా మీద పెద్దగా ప్రేక్షకులకు ఇంట్రెస్ట్ రాలేదనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో త్రివిక్రమ్ స్టార్ డం కూడా తగ్గిపోయిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ కారణంతో త్రివిక్రమ్ పై భారీ ఎత్తున ట్రోల్స్ కూడా చేస్తున్నారు.

దీంతో పాటుగా త్రివిక్రమ్ కి కథలు రాసుకునే సత్తా లేదని ఆయన ఎక్కువగా యద్దనపూడి సులోచనా రాణి నవల ఆధారంగానే సినిమాలను రాసుకునే వారని, అలాగే సక్సెస్ కూడా అయ్యారని పలువురు నెటిజెన్స్ కామెంట్లు చేస్తున్నారు. అయితే యద్దనపూడి లేకపోవడం వల్ల త్రివిక్రమ్ కు సరైన కథలు దొరకడం లేదని.. ఆమె ఉండి ఉంటే రెండు మూడు నవలలను ఆధారంగా చేసుకొని.. సినిమా కథను తెరకెక్కించి వాటి నుంచి క్యారెక్టర్లను తీసుకొని మరీ సినిమా తీసి సక్సెస్ అయ్యేవారు అంటూ పలువురు సినీ విమర్శకులు కూడా తెలియజేస్తున్నారు.

- Advertisement -

ప్రస్తుతం అల్లు అర్జున్ తో ఒక సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది త్రివిక్రమ్. ఎలాగైనా ఈ సినిమాతో తాను ఏంటో ప్రూఫ్ చేసుకోవాలని అందుకు తగ్గ సమయం వచ్చేసిందని తెలుస్తోంది.. ఒకవేళ ఈ సినిమాతో తాను ఏంటో ప్రూవ్ చేయలేకపోతే త్రివిక్రమ్ సినీ ఇండస్ట్రీ నుంచి ఫేడ్ అవుట్ డైరెక్టర్గా చేరిపోతారని పలువురు సినీ ప్రేక్షకుల సైతం తెలియజేస్తున్నారు. మరి త్రివిక్రమ్ ఈ సారైనా తన మార్కును చూపించుకుంటారేమో చూడాలి.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు