Nagarjuna : అవి అక్రమ కట్టడాలే… నాగ్‌పై విరుచుకుపడుతున్న మహిళా సంఘాలు..

Nagarjuna : టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున ( Nagarjuna ) కు సంబందించిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేత ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. దీనిపై ఇప్పటికే ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. ఈ విషయంపై ఎన్నో వార్తలు చెరువులో కట్టిన అక్రమ నిర్మాణం అని హైడ్రా గుర్తించి జరిపిన కూల్చివేత. అది ఆక్రమణ కాదని నాగార్జున కోర్టులో తేల్చుకుంటానని చెప్పారు. దానిని అదే కోణంలో చూడాల్సిన అవసరం ఉంది. అయితే దానిని శోభిత దూళిపాళ్ల (Shobitha )తో ముడిపెట్టడం దారుణం. ఇలాంటి వారిపై శోభిత చట్టపరంగా చర్యలకు కూడా తీసుకుంటుందని సమాచారం.. అయితే తాజాగా ఈ విషయంలో మహిళా సంఘాలు కూడా ఇన్వాల్ అయ్యినట్లు తెలుస్తుంది. అసలు విషయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

అక్కినేని నాగార్జునకు గతంలో ఎన్నడూ లేని విధంగా ఇలా ఆస్తి వివాదాలు రావడం ఇదే మొదటి సారి. అక్రమంగా కట్టారని ఆరోపిస్తూ దాన్ని కూల్చివేసిన సంగతి తెలిసిందే. ఈ విషయం పై నాగార్జున మీడియాతో కూడా మాట్లాడారు. కానీ ఇప్పటికి దీనిపై ట్రోల్స్ ఆగలేదు. ఇక కొత్త కోడలుగా అక్కినేని ఇంట అడుగు పెట్టాలని శోభిత దూళిపాళ్ల నాగచైతన్య ( Naga Chaithanya ) తో నిశ్చితార్థం చేసుకున్న వేళ నుండి ఆమె పైన ట్రోలింగ్స్, వేణు స్వామీ షాకింగ్ జాతకం బయటకు వచ్చాయి. అప్పుడే మహిళాలోకం భగ్గుమంది. వేణుస్వామిపై మహిళా కమీషన్ కు ఫిర్యాదు చేసింది. ఆయనపై చర్యలకు మహిళా కమీషన్ కూడా సిద్ధమై వేణు స్వామి (Venu Swamy ) కి సమన్లు పంపి వివరణ అడిగింది..

Women's groups fire on Nagarjuna
Women’s groups fire on Nagarjuna

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ( CM Revanth Reddy ) తీసుకువచ్చిన హైడ్రా వ్యవస్థ తీసుకున్న నిర్ణయం నాగార్జునకు నష్టం చేస్తే అసలు నష్టం జరిగిందంతా శోభిత వల్లేనంటూ చర్చించటం అన్యాయం. ఇక కొందరైతే సమంతను ఈ వ్యవహారంలో చేర్చి ఇబ్బంది పెడుతున్నారు. ఈ చర్యతో ఇద్దరు ఆడవాళ్ళ గురించి, సినీ సెలబ్రిటీలు అయిన కారణంగా చర్చ జరగటం బాధాకరం. దీంతో హైడ్రా షాక్ నాగార్జునకే కాదు శోభిత కు కూడా షాకే.. ఆమె అడుగు పెట్టక ముందే ఇలా జరిగిందని కొందరు దుమ్మేత్తి పోస్తున్నారు. ఇక హైడ్రా కూల్చివేతలతో ఏమాత్రం సంబంధం లేకుండా ఇబ్బంది పడుతున్న శోభిత ధూళిపాళ పై ప్రస్తుతం జరుగుతున్న చర్చతో మహిళాలోకం ఆమె వైపే నిలిచింది..ఈ పరిస్థితి మారాలని నేటి మహిళ కోరుతోంది. ఏది జరిగినా ఆడవాళ్ళను టార్గెట్ చేసే వ్యవస్థలో మార్పు రావాలని కోరుతున్నారు మహిళా సంఘాలు.. దీనిపై మరో వివాదం వచ్చేలా ఉందని కనిపిస్తుంది..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు