Bangalore Rave Party News: మొన్న విడాకులు ఇప్పుడు రేవు పార్టీ.. అంతా మీ ఇష్టమేనా అంటూ ఫైర్ అయిన శ్రీకాంత్…?

Bangalore Rave Party News: సీనియర్ యాక్టర్ శ్రీకాంత్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఇప్పటికే ఎన్నో సినిమాలలో అనేక రోల్స్ ప్లే చేసి మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు శ్రీకాంత్. వరుస పెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఇక ఈయన ఏ విధంగా నెగిటివ్ రోల్స్ లో నటించాడు అదేవిధంగా పాజిటివ్ రోల్స్ కూడా ప్లే చేశాడు.

ప్రజెంట్ జనరేషన్ లో కూడా స్టార్ హీరోల సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నాడు. ఒకపక్క సినిమాలు తో పాటు మరోపక్క పాలిటిక్స్ లో కూడా యాక్టివ్ గా ఉంటున్నాడు శ్రీకాంత్. ఇక తాజాగా తనపై వస్తున్న తప్పుడు కథనాలను ఖండించాడు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ..” ఇది మా ఇల్లే కదా? మా ఇంట్లోనే ఉన్నాను. సో నేను విన్నాను పొద్దున్నుంచి నాకు ఫోన్లు రావడం జరిగింది నేను కూడా వీడియో క్లిప్స్ తీశాను. మన మీడియా మిత్రులు చాలామంది నన్ను అడిగి క్లారిఫై చేసుకున్నారు.

Yesterday Divorce Now Rave Party
Yesterday Divorce Now Rave Party

చాలా వాటిల్లో శ్రీకాంత్ మీద బెంగళూరులో రేవ్ పార్టీ కి వెళ్లాడు.. ఈ టైపులో ఏవేవో వార్తలు వినిపించాయి. వీటిని చూసి నాకు నవ్వొచ్చింది. మొన్నేమో విడాకులు ఇప్పించేశారు నా భార్యతో ఇప్పుడేమో పార్టీలకు వెళ్ళాడు అంటూ కాదనాలను పుట్టించారు. కానీ ఒకటి.. మీడియా తొందర పడడంలో ఎటువంటి తప్పు లేదనిపించింది. ఎందుకంటే వాడెవడో నా లాగానే ఉన్నాడు. కానీ అది నేను కాదు. తప్పుడు కథనాలను నమ్మకండి ” అంటూ వెల్లడించాడు శ్రీకాంత్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు