Yo Yo Honey Singh : ఆ బ్రాండ్ బట్టలన్నీ కాల్చి తగబెట్టేసాను… ఫోటోగ్రాఫర్ కు హనీ సింగ్ వార్నింగ్

Yo Yo Honey Singh : పాపులర్ ర్యాపర్ యోయో హనీ సింగ్ తన బట్టల గురించి కామెంట్ చేసిన ఫోటోగ్రాఫర్ పై ఫైర్ అయ్యాడు. ఇంకోసారి ఆ బ్రాండ్ పేరు ఎత్తవద్దు అంటూనే ఆ బట్టలన్నీ కాల్చిపారేశాను అని సంచలన కామెంట్స్ చేశారు. మరి ఏ బ్రాండ్ పేరు ఎత్తితే హనీ సింగ్ ఇంతగా ఫైర్ అయ్యాడు ? అంటే…

ఆ బట్టలన్నీ కాల్చేశాడా?

తన భార్య విడాకుల తర్వాత పెద్దగా బయట కనిపించని హనీ సింగ్ ఆదివారం సోనాక్షి సిన్హా వెడ్డింగ్ లో సందడి చేశారు. తన సన్నిహితురాలు, నటి సోనాక్షి సిన్హా వెడ్డింగ్ రిసెప్షన్ తర్వాత ఇంటికి బయలుదేరుతున్న సమయంలో హనీ సింగ్ కు ఓ ఫోటోగ్రాఫర్ అడిగిన ప్రశ్న కోపం తెప్పించింది. బాలెన్‌సియాగా దుస్తులను ధరించి ఇక్కడ మీరేం చేస్తున్నారు? అని అడిగాడు సదరు ఫోటోగ్రాఫర్. దీంతో వెంటనే స్పందించిన హనీ సింగ్ బాలెన్‌సియాగా దుస్తులను ఎప్పుడూ ధరించవద్దు. దాని వెనుక ఉన్న కారణాన్ని గూగుల్లో వెతకండి. దాని చుట్టూ చాలా చెడ్డ వివాదం ఉంది. నేను నా బాలెన్‌సియాగా బట్టలన్నింటినీ కాల్చేశాను. వాళ్లు చాలా చెడ్డ వ్యక్తులు అంటూ షాకింగ్ సమాధానాన్ని ఇచ్చాడు.

ఇక అతని ప్రశ్నకు స్పందిస్తూ ఇది నా బెస్ట్ ఫ్రెండ్ వెడ్డింగ్. నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఆమెకు జహీర్లో సోల్ మేట్ దొరికాడు. నేను అతన్ని మూడేళ్ల క్రితమే కలిసాను. అద్భుతమైన వ్యక్తి. సోనాక్షిని అతను సంతోషంగా ఉంచుతాడని నేను ఆశిస్తున్నాను అని చెప్పుకొచ్చాడు.

- Advertisement -

EXCLUSIVE VIDEO: Yo Yo Honey Singh reveals how his recent break-up delayed the release of his new album | PINKVILLA

బాలెన్‌సియాగా వివాదం ఏంటి ?

బాలెన్‌సియాగా అనేది ఒక స్పానిష్ లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్. ఒకప్పుడు ఈ బ్రాండ్ దుస్తులకు మంచి డిమాండ్ ఉండేది. అయితే 2022లో బాలెన్‌సియాగా తమ బ్రాండ్ ప్రచారం కోసం చేసిన రెండు యాడ్స్ తీవ్ర దూమారాన్నిరేపాయి. ఆ యాడ్ చూశాక సెక్సువలైజింగ్ చిల్డ్రన్ అంటూ బాలెన్‌సియాగాను బాయ్ కాట్ చేయాలని భారీ ఎత్తున డిమాండ్ చేశారు. దీంతో లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్ అందరికీ క్షమాపణలు చెప్పింది. అంతేకాకుండా దాని నిర్మాణ సంస్థ నార్త్ సిక్స్ ఇంక్ పై దాదాపు 25 మిలియన్లకు పైగా ఈ కారణంతో దావా వేసింది.

ఇక ఆ వివాదం రేపిన విషయం ఏమిటంటే ఓ యాడ్ లో బాలెన్‌సియాగా చిన్నపిల్లలను టెడ్డీబేర్ బ్యాగ్స్, బ్యాండేజ్ థీమ్ ఎలిమెంట్స్ తో తయారు చేసి ఫోటోలు తీశారు. మరో యాడ్ లో చిల్డ్రన్ పొర్నోగ్రఫీపై అమెరికన్ సుప్రీం కోర్ట్ 2008 లో ఇచ్చిన ఆదేశాలకు సంబంధించిన పేపర్లను ఉపయోగించి పిల్లలతో ఫోటో షూట్ చేయించారు. దీంతో తమ ప్రచారం కోసం చేసిన ఈ రెండు యాడ్స్ వల్ల బాలెన్‌సియాగాపై తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. అనంతరం బాలెన్‌సియాగా ఈ కాంట్రవర్సీకి సంబంధించిన ఫోటోలు అన్నింటిని డిలీట్ చేసి ఇన్స్టాగ్రామ్ లో క్షమాపణలు చెబుతూ సుదీర్ఘ నోట్ ను రిలీజ్ చేసింది. తాజాగా ఈ విషయం హనీ సింగ్ కారణంగా మళ్లీ వార్తల్లో నిలిచింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు