YVS Chowdary : నాకు క్యాస్ట్ ఫీలింగా… కోపంతో ఊగిపోయిన చౌదరి గారు

YVS Chowdary : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న దర్శకులలో వైవిఎస్ చౌదరి ఒకరు. ప్రతి దర్శకుడు మీద ఒక ఒపీనియన్ ఉంటుంది. అలానే కొంతమంది దర్శకులు కొందరితో మాత్రమే సినిమాలు చేస్తారు అంటూ చెబుతూ ఉంటారు. అరవింద సమేత వీర రాఘవ ముందు వరకు రాజమౌళి చేసిన హీరోలతో త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలు చేయరు. త్రివిక్రమ్ శ్రీనివాస్ హీరోలతో రాజమౌళి సినిమాలు చేయరు అంటూ వార్తలు వచ్చాయి. అయితే అరవింద సమేత వీర రాఘవ సినిమాతో ఎన్టీఆర్ తో మొదట పనిచేశాడు త్రివిక్రమ్. ఇప్పుడు మొదటిసారి మహేష్ బాబు తో పని చేస్తున్నాడు రాజమౌళి.

దర్శకుడు వైవిఎస్ చౌదరి గురించి చాలామందిలో ఒక అభిప్రాయం ఉంది. ఒకే సామాజిక వర్గానికి చెందిన హీరోలతో ఎక్కువగా సినిమాలు చేస్తారు అని చెబుతూ ఉంటారు. వాస్తవానికి ఆయన చేసిన సినిమాలు లిస్టు చూసిన కూడా అది నిజమే అనిపిస్తుంది. రేయ్,నిప్పు సినిమాలు మినహాయిస్తే మిగతా సినిమాలన్నీ కూడా ఒకే సామాజిక వర్గానికి చెందిన హీరోలు ఎక్కువగా ఉంటారు. లేదంటే మెయిన్ లీడ్ పాత్రలో ఎక్కువగా ఉంటారు. ఇదే విషయాన్ని ఒక ప్రముఖ సినీ జర్నలిస్ట్ అడిగినప్పుడు. అది ఒక కో ఇన్సిడెంట్ అని కాకుండా ఇద్దరు ముగ్గురు హీరోల పేర్లు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఏం మాట్లాడుతున్నారు భయ్యా అంటూ ఫైర్ అయ్యారు. మా భార్య క్యాస్ట్ ఏంటో మీకు తెలుసా అంటూ తిరిగి ప్రశ్నించారు. అయితే దానికి సదరు జర్నలిస్ట్ బయట మీ మీద ఉన్న ఒపీనియన్ ని అడిగా అంటూ చెప్పుకోచ్చారు. దానికి తిరిగి వైవిఎస్ చౌదరి థాంక్యూ చెప్పాడు.

YVS Chowdary

- Advertisement -

ఇకపోతే శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి సినిమాతో దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత సీతారామరాజు, యువరాజు , లాహిరి లాహిరిలో వంటి సినిమాలను తెరకెక్కించాడు. రామ్ హీరోగా పరిచయమైన దేవదాసు సినిమా అద్భుతమైన బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. 2015 లో రిలీజ్ అయిన రేయ్ సినిమా తర్వాత ఇప్పటివరకు వైవిఎస్ చౌదరి నుంచి ఒక సినిమా కూడా రాలేదు. ఇప్పుడు ప్రస్తుతం నందమూరి వంశం నుంచి మరో నట వారసుని పరిచయం చేస్తూ కొత్త సినిమాలు చేస్తున్నాడు వైవిఎస్ చౌదరి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు