Yvs Chowdary : సంచలన దర్శకుడు తొమ్మిదేళ్ల తర్వాత ప్రాజెక్ట్ అనౌన్స్ చేసాడు , నందమూరి 4వ తరం పరిచయం

Yvs Chowdary : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న వైవిధ్యమైన దర్శకులలో వైవిస్ చౌదరి ఒకరు. ఎన్నో అద్భుతమైన హిట్ సినిమాలను తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో తెరకెక్కించారు వైవిఎస్ చౌదరి. చాలామందిని హీరోలుగా కూడా పరిచయం చేసిన ఘనత వైవిఎస్ చౌదరికి దక్కుతుందని చెప్పొచ్చు. తనే నిర్మాతగా తనే దర్శకుడుగా కూడా సినిమాలు చేస్తుంటారు వైవిఎస్ చౌదరి. మహేష్ బాబు హీరోగా పరిచయమైన యువరాజు సినిమాను తెరకెక్కించింది ఈ దర్శకుడు. నందమూరి హరికృష్ణ కి అతిపెద్ద వీరాభిమాని ఈయన.

రేయ్ సినిమాతో సాయి తేజ్ పరిచయం

రీసెంట్ టైమ్స్ లో వైవిఎస్ చౌదరి సినిమాలు చేయటం తగ్గించారు. దాదాపు ఈ దర్శకుడి నుంచి సినిమా వచ్చి తొమ్మిదేళ్లు అవుతుంది. సాయి ధరమ్ తేజ్ హీరోగా పరిచయమైన రేయ్ సినిమా కి చివరగా దర్శకత్వం వహించారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘనవిజయం సాధిస్తుందని చాలామంది నమ్మారు. కానీ ఈ సినిమా బీభత్సమైన డిజాస్టర్ గా మారింది. సినిమా మీద అందరికీ మంచి అంచనాలు ఉండేవి. ఈ సినిమాకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్ గా హాజరై సాయి తేజ్ ను బ్లెస్ చేశారు. అప్పుడు వైవీఎస్ చౌదరి పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసి తనపైన ఇష్టాన్ని కూడా తెలిపారు పవన్ కళ్యాణ్.

దేవదాసు సినిమాతో రామ్ పోతినేని పరిచయం

ఇకపోతే వైవిఎస్ చౌదరి కెరియర్ లో బెస్ట్ ఫిలిం అంటే దేవదాస్ అని చెప్పొచ్చు. రామ్ పోతినేని హీరోగా పరిచయమైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అప్పట్లో ఈ సినిమా ఒక సంచలనం అని చెప్పొచ్చు. మొదటి సినిమాతోనే రామ్ మంచి హీరోగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో స్థిరపడిపోయాడు. ఈ సినిమాతోనే ఇలియానా కూడా తెలుగు సినిమాకు పరిచయమైంది. ఈ సినిమాకి చక్రి అందించిన మ్యూజిక్ చాలా ప్లస్ అని చెప్పొచ్చు.

- Advertisement -

Yvs Chowdary

మళ్లీ 9 ఏళ్ల తర్వాత

సీతారాముల కళ్యాణం చూతము రారండి, టైగర్ హరిచంద్ర ప్రసాద్, బాలకృష్ణ నటించిన ఒక్కమగాడు, సీతయ్య వంటి ఎన్నో సినిమాలను తెరకెక్కించారు వైవిఎస్ చౌదరి. దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత వైవిఎస్ చౌదరి తను మళ్లీ చేయబోయే సినిమా గురించి అప్డేట్ ఇచ్చారు.న్యూ టాలెంట్ రోర్స్ అనే బ్యానర్ పై యలమంచిలి గీత నిర్మిస్తున్న ఒక సినిమాకి దర్శకుడిగా వైవిఎస్ చౌదరి వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాతో నందమూరి హరికృష్ణ పెద్ద కుమారుడైన జానకిరామ్ తనయుడు (అంటే హరి కృష్ణ మనవడు) నందమూరి తారకరామారావు ను పరిచయం చేస్తున్నారు.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు